-కడియం శ్రీనివాసరావు తల్లికి రూ.5 లక్షల బీమా చెక్కు
కోదాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యుడు, పార్టీ కోసం పని చేసిన జన సైనికుడు కడియం శ్రీనివాసరావు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో నివాసముంటున్న ఆయన కుటుంబాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కడియం శ్రీనివాసరావు తల్లి లక్షమ్మ కి జనసేన పార్టీ ప్రవేశపెట్టిన కీయాశీలక సభ్యత్వం ప్రమాద బీమా పథకం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామ్ తాళ్లూరి, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు మేకల సతీష్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, విద్యార్ధి విభాగం నాయకుడు సంపత్ నాయక్, యువజన విభాగం నాయకుడు లక్ష్మణ్ గౌడ్, పార్టీ నాయకుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.