Breaking News

ఆటల ద్వారానే అన్నింట్లో గెలుపు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడలతో మానసిక పరిపక్వత వస్తోంది .మానవ సంబంధాలు మెరుగు పడటంతో పాటు పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ఆటల ద్వారానే అలవడతాయి . శాప్ (ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ) చేపట్టిన ” హ్యాపీ సాటర్ డే ” కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది .ఆనంద శనివారంతో రాష్ట్రం లోని క్రీడా మైదానాలు , ఇండోర్ స్టేడియాలు సందడిగా మారాయి . ఆనంద శనివారాన్ని ఊరూరా నిర్వహించాలని శాప్ ఎండీ ఎన్. ప్రభాకర రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలోని మైదానాలన్ని చిన్నారులు , యువత ,క్రీడాకారులతో కళకళ లాడాయి . ఇప్పటికే సమ్మర్ క్యాంపుల్లో వివరాలు నమోదు చేసుకున్న 43000 మంది మైదానాల్లో శనివారం సందడి చేశారు . రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఆటల ద్వారానే ఆరోగ్యం , ఆనందం అనే సూత్రాన్ని విశ్వసించిన తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని మైదానాల్లో బారులు తీరారు . విజయవాడ , విశాఖ , గుంటూరు , తిరుపతి , అనంతపురం , చిత్తూరు , కాకినాడ , ఒంగోలు , ఏలూరు , రాజమహేంద్రవరం జిల్లాలో మైదానాలు , క్రీడాప్రాధికార సంస్థ స్టేడియాలు కిక్కిరిసి పోయాయి . మొబైల్ , టీవీలకు అతుక్కు పోతున్న పిల్లలను యోగా , ఏరోబిక్స్ , జిమ్నాస్టిక్ , వాలీబాల్ , క్రికెట్ , బ్యాడ్మింటన్ , అథ్లెటిక్స్ లలో చేర్పించి సమ్మర్ క్యాంపుల ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు . క్రీడల ద్వారానే పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం , ఏర్పడుతుందని గుర్తించిన శాప్ అందరిని మైదానాల వైపు మళ్లించేందుకే ‘ఆనంద శనివారం ‘ అనే కార్యక్రమాన్ని చేపట్టింది .ఈ నేపథ్యంలో శాప్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది . లీగ్స్ , టోర్నమెంట్లు నిర్వహిస్తూనే గ్రామాల నుంచి పట్టణాల వరకు స్పోర్ట్స్ క్లబ్బుల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది . వారాంతంలో క్రీడాకారులను , చిన్నారులు , యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని శాప్ చేపట్టింది . రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తోంది . ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా , శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి , ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ్ , ముఖ్య కార్యదర్శి జి . వాణి మోహన్ , శాప్ బోర్డు సభ్యుల సహకారంతో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు శాప్ వీసీ & ఎండీ ఎన్ . ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు . రాష్ట్రంలో క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ అందేలా చూడటమే లక్ష్యంగా శాప్ పని చేస్తుందని ఎండీ తెలిపారు .

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *