-సిబ్బందికి పలు సూచనలు – అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రతి శనివారం సిబ్బందిచే నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమాలను అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల క్షేత్ర స్థాయిలో ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగములను పరిశీలించారు. ప్రతి శనివారం సిబ్బంది విధిగా క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ, తమ తమ కార్యాలయాలను శుభ్రపరచుకోవాలని అన్నారు. అదే విధంగా మినిస్ట్రీయల్ సిబ్బంది కూడా వారికి సంబందించిన అల్మారాలను శుభ్రం చేసుకొని, ఫైల్స్ డిస్పోజ్ చేయునట్లుగా చూడాలని అన్నారు. నగరపాలక సంస్థ నందు అనేక పనుల నిమిత్తం వచ్చు ప్రజలకు మంచి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ వారికీ మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది పని చేయాలని సూచించారు.