విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ ఆద్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల మిలియన్ ప్లస్ నగరముల అర్బన్ లోకల్ బాడి కమిషనర్ లకు వాతావరణములో గాలి నాణ్యతా ప్రమాణముల మెరుగుదలకు తీసుకొనవలసిన చర్యలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక తయారు చేయుటకు, అందుకు అవసరమగు నిధులను 15వ ఆర్ధిక సంఘం నుండి మంజూరు చేయుటకు చెన్నై నందు నిర్వహించిన వర్క్ షాప్ నందు విజయవాడ నగరం నుండి నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, హాజరైనారు. ఈ వర్క్ షాప్ నందు సమీకృత వ్యర్ద పదార్దముల నిర్వహణ వ్యవస్థ, ప్లాస్టిక్ వ్యర్ధ పదార్దముల నిర్వహణ ఆరోగ్యకరమైన జాతి నిర్మాణము కొరకు చేపట్టవలసిన చర్యలపై చర్చించుట జరిగింది. సదరు వర్క్ షాప్ నందు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విజయవాడ నగరంలో గాలి నాణ్యత ప్రమాణముల మెరుగుదలకు, గాలి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపించు ఆయా వ్యవస్తల నియంత్రణకు, రక్షిత డిస్పోజవ్ విధానముపై సమగ్రముగా వివరించారు. అజిత్ సింగ్ నగర్ డంపింగ్ యార్డ్ నందలి 3.05 మెట్రిక్ టన్నుల లెగసి వ్యర్దపదార్దములను బయో మైనింగ్ ద్వారా పర్యావరణ సహిత పార్క్ గా మార్పు చేయుచున్నామని, భవన నిర్మాణముల మరియు పాత భవనముల డెబ్రిష్ ప్రాసెస్ చేయు విధానము, వాతావరణములో గాలి నాణ్యతపై ప్రధానంగా ప్రభావం చూపించు వాహనముల వినియోగంలో ప్రత్యేక శ్రద్ద కనబరచి ఎలక్ట్రికల్, సి.ఎన్.జీ వాహనముల ఏర్పాటు, విద్యుత్, గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికల ఏర్పాటు, కాలువల సుందరీకరణ, ప్లాస్టిక్ నియంత్రణ కొరకు వాటర్ బాటిల్స్ వాడకం కూడా నిషేదించి స్టీల్ బాటిల్స్, పేపర్ గ్లాస్ వాడుచున్నామని వివరించారు. అదే విధంగా నగరంలో రోడ్డు అంచు నుండి అంచు వరకు నిర్మాణం చేపట్టబడినవి, పారిశుధ్య కార్యక్రమములలో యాoత్రీకరణతో మెరుగైన ఫలితాలు సాధించుచున్నామని తెలియజేసారు. విజయవాడ నగరంలో చేపట్టిన పలు చర్యలు మార్గదర్శకంగా కలవని హాజరైన ప్రతినిధులు ప్రశంసిoచిరి. ఆచరణాత్మక ప్రణాళికలతో సమర్ద యంత్రాంగంతో నగరమును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుటకు కృషి చేయచున్నామని కమిషనర్ వివరించారు. సదరు వర్క్ షాప్ నందు కమిషనర్ గారితో పాటుగా నగరపాలక సంస్థ సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …