-జిల్లా కలెక్టర్ యస్‌డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం జిల్లా కలెక్టర్ క్యార్యాలయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటి ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటి ప్రతినిధులు జిల్లాలోని పిల్లల సంరక్షణ సంస్థల్లో అనేక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ యస్ డిల్లీరావు స్పందిస్తూ ఎన్‌టిఆర్ జిల్లాలో అనాధ పిల్లలు, వీధి బాలలు కొరకు చైల్డ్ సంరక్షణ సంస్థలు 29 ఉన్నాయని వీటిలో 3 ఒపెన్ షెల్ట్‌ర్‌లు ఉండగా 26 చైల్డ్ కేర్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. వీటికి సంబంధించిన భవనాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి చేస్తామన్నారు. హనుమాన్ పేట లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటిలో బెంచ్ ఏర్పాటు చేయాలని 2006 నుండి చైల్డ్ వెల్ఫేర్ భవనం అందరికి సుపరిచయం అని అందుకే చైల్డ్ వెల్ఫేర్ భవనాన్ని ఇతర ప్రదేశాలకు తరలించకుండా ప్రస్తుతం ఉన్న భవనంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కమిటి మెంబర్స్ కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. 5 సంవత్సారాలలోపు పిల్లలకు ప్రభుత్వ భవనం ఏర్పాటు చేయాలని 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు వేరువేరుగా హోంలు ఏర్పాటు చేయాలని కమిటి సభ్యులు కోరగా కలెక్టర్ స్పందిస్తూ ఆయా సమస్యలపై పరిష్కరించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటిని అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు.
సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్స్‌న్ కె. సువార్త, చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు సిహెచ్ రాధకుమారి, రవిభార్గవ్, కృష్ణకుమారి పాల్గొన్నారు.