-తనదైన శైలితో జిల్లా కలెక్టర్ డిల్లీరావు పాలనలో బిజీ బిజీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయన పేరు డిల్లీరావు ఎన్‌టిఆర్ జిల్లాకు కలెక్టర్ అయినా…గ్రామ గ్రామం గల్లీగల్లీ తిరుగుతూ నిమిషం కూడా వృదా చేయకుండా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలను నిత్యం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తూ… కలెక్టర్ అనే హోదా చూడకుండా ఎటువంటి భేషజాలు, అధికార దర్పం లేకుండా చిరునవ్వుతో తన తోటి అధికారులతో టీమ్‌లో సభ్యుని వలే ఎప్పటికప్పుడు అధికారులకు సిబ్బందికి సూచనలు సలహాలు ఇస్తూ… టీమ్ ఎన్‌టిఆర్ జిల్లాల బృంద నాయకుడిగా ఒక వైపు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు నవరత్నాలు పేదలందరికి ఇళ్ల ప్రగతిని పర్యవేక్షణ చేస్తూ… మండుటెండనూ లెక్కచేయకుండా పర్యటన చేశారు. శనివారం గన్నవరం మండలం సూరంపల్లి జగనన్న కాలనీ లేఅవుట్ల పరిశీలన, ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో స్వచ్ఛ సంరక్షణ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించేందుకు పర్యటిస్తూ… మార్గ మధ్య ప్రయాణంలో సమయం వృదా చేయకుండా ఆలసట లేకుండా క్షేత్రస్థాయి అధికారులతో మిర్చి పంట పై నల్ల తామర తెగులు నివారణ చర్యలుపైన, కార్మికులకు కనీస వేతనాల అమలు, బాల నేరస్తుల సంరక్షణ వంటి అంశాలపై తన వాహనంలోనే లాప్‌ట్యాప్ ద్వారా గూగుల్ కాన్ఫరెన్స్‌లో సమీక్షలను నిర్వహిస్తూ… తన సమయాన్నే కాకుండా జిల్లా అధికారుల సమయాన్ని సద్వినియోగ పరుస్తూ… సమావేశాలని అయ్యే ఖర్చులను కూడా ఆదా చేస్తూ…ప్రగతి లో జిల్లాను పరుగులు పెట్టిస్తూన్నారు. మన ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు.