-చేనేత వస్త్త్రాల విక్రయాలపై 30 శాతం రిబేట్
-అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, డియంఓ ఎస్ వి వి ప్రసాద్‌రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అప్కో సెలబ్రేషన్స్ షోరూమ్‌లో నిర్వహిస్తున్న సమ్మర్ శారీ మేళాకు మహిళల నుండి వస్తున్న విశేషమైన ఆదరణ కారణంగా సమ్మర్ శారీ మేళాను మే 31వ తేది వరకు పొడిగించి అమ్మకాలపై 30 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు అప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్‌రావు, అప్కో డివిజనల్ ఆఫీసర్ ఎస్‌వివి ప్రసాద్‌రెడ్డి సయూక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పేరెన్నికగన్న చేనేత కళాకారులు రూపొందించిన నేత వస్త్రాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అప్కో సెలబ్రేషన్స్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 12వ తేది విజయవాడ పాలీక్టినిక్ రోడ్ వద్ద అప్కో నూతన మోగా షోరూమ్‌లో సమ్మర్ శారీ మేళాను మంత్రివర్యులు ఆర్కే రోజా ప్రారంభించడం జరిగిందన్నారు. శారీ మేళాకు మహిళల నుండి విశేషమైన ఆదరణ లభించడంతో మే 31వ తేది వరకు పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. శారీ మేళలో మగువలకు నచ్చే విధంగా అతి సన్నని నూలు దారాలతో తయారు చేయబడిన చీరలనుపై ఆకక్షణీమైన డిజైన్‌లను ప్రింట్ చేసి అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలో ఉంచడం జరిగిందన్నారు. వీటితో పాటు వెంకటగిరి, మాదవరం, కంచిపట్టు ధర్మవరం, ఉప్పాడ, కుప్పడం, పట్టుచీరలు రాజమండ్రి, బందరు, పోలవరం, చీరాల, వెంకటగిరి కాటన్ చీరలు, మంగళగిరి కాటన్ చీరలు ఆదునాతన ప్రింటింగ్ చీరలు, యువతి యువకులకు రేడిమేడ్ వస్త్రాలు, టాప్స్, పంజాబి డ్రస్స్‌లు, కుర్తాలు, పైజమా వంటివి అప్కో మేగా షోరూమ్ ద్వారా విక్రయిస్తున్నాట్లు మేగా షోరూమ్ మేనేజర్ వై గోపాల కృష్ణ తెలిపారు.