Breaking News

కర్బన రహిత ఆర్ధిక వ్యవస్థకు ఏపీ దిక్సూచి… : సీఎం వైఎస్‌.జగన్‌

-ఏపీ ఆధ్వర్యంలో ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీ పై సెషన్‌
-ఉజ్వల భవిష్యత్తుకు డీకార్బనైజ్డ్‌ ఎకానమీకి మద్ధతు
-33 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌కు ఏపీలో అవకాశాలున్నాయి
-ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలకు ఆహ్వానం

దావోస్‌, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రాన్సిషన్‌ టు డీకార్బనైజ్డ్‌ ఎకానమీపై దావోస్‌లో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఉజ్వల భవిస్యత్తుకోసం దీనికి మద్దతు పలకాలన్నారు. సెషన్‌లో సీఎం ప్రారంభ ఉపన్యాసం చేశారు. నీతి ఆయోగ్‌ (ఇండియా) సీఈఓ అమితాబ్‌ కాంత్, ఆర్సిలర్‌ మిట్టల్‌ సీఈఓ ఆదిత్య మిట్టల్, గ్రీన్‌కో గ్రూపు ఎండీ అండ్‌ సీఈఓ అనిల్‌ చలమలశెట్టి, దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ ఈ సదస్సులో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్‌ హెడ్‌ రిచర్డ్‌ సెషన్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు.

డీ కార్బోనైజ్డ్‌ ఎకానమీ దిశగా ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన. ఇంధన రంగంలో భవిష్యత్తులో జీరో కార్బన్‌ దిశగా.. అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు,గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి. తదితర అంశాలపై ఈ సెషన్‌లో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మాట్లాడుతూ…
కర్బన రహిత యంత్రాంగం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. పర్యావరణ, సామాజికాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం అన్నది మన బాధ్యత. కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దిక్సూచిగా నిలబడనుంది. ఇక్కడకు రావడానికి కొద్ది రోజుల క్రితమే నేను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 5230 మెగావాట్ల ఇంటిగ్రేడెట్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఒకేచోట 1650 మెగావాట్ల సామర్ధ్యం గల పంప్డ్‌ స్టోరేజీ… ఇది ఒక బ్యాటరీ తరహాలో పనిచేస్తుంది. దీనికి అనుసంధానంగా 3 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్రాజెక్టు రానుంది. 900 మెగావాట్ల పవన విద్యుత్‌ కూడా ప్రాజెక్టు కూడా ఇక్కడే రానుంది. మొత్తం 5,230 మెగావాట్ల ప్రాజెక్టు ఇది.
ఈ విధానంలో ఒక డ్యామ్‌ నిర్మిస్తాం. అందులో కేవలం 1 టీఎంసీ నీరు ఉపయోగిస్తాం. దీన్ని ఉపయోగించి… విద్యుత్‌ వినియోగం అత్యధికంగా ఉన్నప్పుడు (పీక్‌ అవర్స్‌లో) నీటిని వదిలి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాం. వినియోగం తక్కువగా ఉన్నప్పుడు (నాన్‌ పీక్‌ అవర్స్‌లో) మరలా నీటిని రిజర్వాయరులోకి వెనక్కి లిప్ట్‌ చేస్తాం. అప్పుడు పవన, సౌర విద్యుత్‌ వాడుకుంటాం. ఫలితంగా 1650 మెగావాట్ల ఫర్మ్‌ పవర్‌ అందుబాటులోకి వస్తుంది. ఇది చాలా మంచి అవకాశం. దీనివల్ల 24 గంటలపాటు పగలు, రాత్రి కూడా పవర్‌అందుబాటులోకి వస్తంది. చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఇది స్ధిరమైనది, ఆర్థికంగా బలమైనది.

వినియోగం తక్కువగా ఉన్న సమయంలో(నాన్‌ పీక్‌ అవర్స్‌లో) … పవన, సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ విద్యుత్‌ను ఉపయోగించుకుని… నీటిని మరలా రిజర్వాయరులోకి పంపింగ్‌ చేస్తాం. ఇది చాలా సులువైన మెకానిజమ్‌.

మనం 15,16 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ గురించి మాట్లాడుతున్నాం. కానీ వాస్తవానికి 33వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. ఆ మేరకు ఏపీలో విస్తృతంగా అవకాశాలున్నాయి. ప్రపంచనలుమూలల నుంచి వచ్చి ఇందులో భాగస్వాములు కావచ్చు. సంప్రదాయ పరిశ్రమల నుంచి సంప్రదాయేతర పరిశ్రమలకు కూడా మార్పుచెందవచ్చు.
సంప్రదాయ పరిశ్రమ నుంచి గ్రీన్‌ పరిశ్రమగా మారడంతో పాటు..ఈ పవర్‌ను ఉపయోగించుకుని హైడ్రోజన్, అమ్మోనియా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఎలక్ట్రాలసిస్‌ పద్ధతిలో నీటి డీశాలినైజేషన్‌ ప్రక్రియ కూడా చేయవచ్చు. భవిష్యత్తులో ఇవన్నీ సాకారమవుతాయి. వీటన్నింటికీ ఆంద్రప్రదేశ్‌ మీకు స్వాగతం పలుకుతుంది.

డీకార్భనైజేషన్‌ పై చర్చ జరగాల్సిన అవసరంఉంది…
డీకార్భనేజైషన్‌ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మైలురాయిగా నిలుస్తాయి. 5230 సౌర, పవన, పంప్డ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును ఒకే వేదికపై ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనం. ఇందులో 1650 మెగావాట్స్‌ పంప్డ్‌ స్టోరేజీ అంటే బ్యాటరీ పవర్‌. ఎలాంటి హానికరం కాని బ్యాటరీ. కేవలం ఈ 1650 మెగావాట్లు మాత్రమే కాదు.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ ఈ రంగంలో మరింత విస్తృతంగా పెట్టుబడులును ఆహ్వానిస్తోంది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న ఎవరికైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. పర్యావరణం పరిరక్షణపట్ల సానుకూల దృక్ఫదం ఉన్నవారెవరైనా ముందుకు వస్తే సాదర స్వాగతం పలుకుతాం.

అమితాబ్‌ కాంత్, నీతి ఆయోగ్‌ సీఈఓ:
గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం దిశగా ఏపీ సీఎం చూపిన చొరవ ఈ రంగంలో యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలవనుంది.
– ప్రపంచంలో కర్బన కాలుష్యానికి భారత్‌ కారణం కాదు. భారత్‌లో కర్బన ఉద్గార కారకాల తలసరి వినియోగం చాలా తక్కువ. అయితే కర్బన రహిత పారిశ్రామికీకరణ ప్రక్రియలో ప్రపంచంలోనే భారత్‌ తొలి దేశంగా నిలవాల్సి ఉంది. ఇది ఒక సవాల్‌ మాత్రమే కాదు. అందివచ్చిన ఒక అవకాశంగా చూడాల్సి ఉంది.
ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత్‌లో ఒక్కో కిలో వాట్‌ హవర్‌ (కేవీహెచ్‌) విద్యుత్‌ ఉత్పత్తిలో 2.7 సెన్స్‌ పునరుత్పాదకాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే ఒక్కో కిలో వాట్‌ హవర్‌కు దాదాపు రూ.1.99 అన్నమాట. ఆ విధంగా కాప్‌–21 సమావేశంలో నిర్దేశించుకున్న ఎన్‌డీసీ లక్ష్యాన్ని సాధించిన ఏకైక దేశంగా (జీ–20 దేశాలు కాకుండా) భారత్‌ నిలుస్తోంది.
ఇప్పుడు భారత్‌ ముందున్న సవాల్‌ ఏమిటంటే, ఒక్కో కిలో వాట్‌ హవర్‌ (కేవీహెచ్‌) విద్యుత్‌ ఉత్పత్తిలో 2.7 సెన్స్‌ పునరుత్పాదకాలు ఉత్పత్తి అవుతుండగా, దాన్ని సగానికి అంటే, 1.35 సెన్స్‌కు తీసుకురావాల్సి ఉంది. తద్వారా హరిత ఉదజని (గ్రీన్‌ హైడ్రోజన్‌) సాధించి, ప్రపంచంలోనే దీనికి ఒక ముఖ్య కేంద్రంగా నిలవాల్సి ఉంది. ఒక్కో కిలో హరిత ఉదజని ధర దాదాపు 4 డాలర్ల నుంచి 4.25 డాలర్ల వరకు ఉంటుంది. దాన్ని 2025 నాటికి 2.25 డాలర్ల నుంచి 2.5 డాలర్ల వరకు.. అదే విధంగా 2030 నాటికి ఇక డాలర్‌కు తీసుకురావాల్సి ఉంది. అయితే ఇది అతి తక్కువ వ్యయానికే పునరుత్పాదకాలు పెంచినప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే హరిత ఉదజని ఉత్పత్తిలో 70 శాతం పునరుత్పాదకాలది కాగా, 10 శాతం విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించింది కాగా, మిగిలిన 20 శాతం ఆ ప్లాంట్‌కు సంబంధించి ఉంటుంది.
ఆ విధంగా పునరుత్పాదకాలు పెంచి, హరిత ఉదజని ఉత్పత్తి చేయలేకపోవడంతో మనం చూశాం.. విద్యుత్‌ గ్రిడ్‌ సమస్యను కాలిఫోర్నియాలో సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. అందుకే నిర్విరామంగా గ్రీన్‌ పవర్‌ (హరిత విద్యుత్‌..కాలుష్య రహిత విద్యుత్‌) ఉత్పత్తి చేయాల్సి ఉంది.
దీనికి సంబంధించి ఇప్పుడే యువకుడు, ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి చెప్పారు.. రాష్ట్రంలో ఒకేచోట సౌర, పవన, జల విద్యుత్‌ ప్లాంట్‌ ద్వారా చౌకలో కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టబోతున్నట్లు. ఆ విధంగా ఒకేచోట సుమారు 1650 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకవేళ అదే విధంగా 23 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే, భారత్‌లో ముఖ్యమైన కర్బన రహిత కేంద్రంగా నిలుస్తుంది. తద్వారా ‘కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన’లో యావత్‌ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తుంది.
మొత్తం శక్తి రంగంలో విద్యుత్‌ రంగం వాటా 18 శాతం మాత్రమే. మిగిలిన 82 శాతం ఇతర రంగాలకు సంబంధించింది. రిఫైనరీ, స్టీల్‌ ప్లాంట్లు, ఫర్టిలైజర్, దూర ప్రాంతాల రవాణాలో వినియోగం. ఎందుకంటే పునరుత్పాదకాలతో వాటిని నడపలేం. అందుకే ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాల్‌ హరిత ఉదజని. అందుకే ఫర్టిలైజర్, స్టీల్, రిఫైనరీ, షిప్పింగ్‌ రంగాలు కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగం దిశగా మారాల్సి ఉంది. ఎవరు ఆమోదించినా ఇది వాస్తవం. ఆ దిశలో ఏపీ సీఎం చూపిన చొరవ ఈ రంగంలో యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలవనుంది.

ఆదిత్య మిట్టల్‌. ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌. సీఈఓ:
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల విధానాలు
ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం.
ఏపీలో భవిష్యత్తులో పెట్టుబడులు రెట్టింపు చేయనున్నాం.
– ఆంధ్రప్రదేశ్‌లో మేము భారీ పెట్టుబడి పెట్టడం జరిగింది. రాష్ట్రంలో గ్లోబల్‌ రెన్యువబుల్‌ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో కంపెనీ భాగస్వామ్యంతో కలిసి పని చేస్తున్నాము. అది మా కంపెనీ లక్ష్యాన్ని చూపుతుంది. ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌ 27 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయినా రెన్యువబుల్‌ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడికి ఎంతో సానుకూలంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంట్‌ను నేను స్వయంగా సందర్శించాను. అక్కడ జరుగుతున్న పనులు, ఒకేచోట మూడు రకాల విద్యుత్‌ ఉత్పత్తి కానుండడం, అలాగే తక్కువ నీటి వినియోగం, ఇంకా జరగనున్న పునరుత్పాదకాల ఉత్పత్తి నిజంగా ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడ 650 మిలియన్‌ డాలర్లు.. (దాదాపు రూ.5000 కోట్లకు పైగా) పెట్టుబడి సమకూర్చడం జరిగింది. అక్కడ రోజంతా 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగనుండడం నిజంగా అద్భుతం. అక్కడ భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేయనున్నాం. పునరుత్పాదకాలు, హరిత ఉదజని ఉత్పత్తి కోసం మా వంతుగా పూర్తిగా చొరవ చూపుతాం. అన్ని విధాలుగా అనుకూల విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *