Breaking News

నాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వేలో ట్రాక్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్న తనపై అకారణంగా కక్షకట్టి వేధింపులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం జరగకపోతే ఈనెల 27న డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటానని పెందుర్తి విక్టర్‌బాబు హెచ్చరించారు. గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరులో రైల్వేట్రాక్‌మేన్‌గా 2016లో ఉద్యోగం చేస్తున్న సమయంలో పై అధికారి యర్రంశెట్టి వెంకటేశ్వరరావు తనపై అకారణంగా దౌర్జన్యం చేసి దాడి చేశారన్నారు. ఈ విషయం పై అధికారుల దృష్టికి వెళుతుందన్న ఉద్దేశ్యంతో తనపై అక్రమంగా పోలీస్‌ కేసు పెట్టారన్నారు. అది తప్పుడు కేసని తేలిందని, దీంతో మరింత భయపడి రైల్వే ఏడీఈఎన్‌కు తనపై లేనిపోని ఆరోపణలు చేసి, సస్పెండ్‌ చేయించారన్నారు. దీంతో తాను క్యాట్‌ను ఆశ్రయించానని, తొలగింపు ఉత్తర్వులు చెల్లవని వారు ధృవీకరించడంతో తనను బిట్రగుంట బదిలీ చేశారన్నారు. తన శాఖలో బదిలీలు చేసేందుకు అవకాశం లేకపోయినా, కక్షగట్టి ఈ విధంగా చేశారని, మరో ప్రక్క తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని, తన ఇద్దరు పిల్లలకు ఫీజులు కట్టలేక, మానసిక, శారీకంగా కృంగిపోతున్నానన్నారు. దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో తనకు ఆత్మహత్యే దిక్కన్నారు. ఇప్పటికైనా తనను ఏలూరు బదిలీ చేసి, గతంలో వున్న గ్రేడ్‌ పేని అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో చైతన్య భారతి సర్వీస్‌ ఆర్గనైజింగ్‌ అధ్యక్షుడు బి.చిట్టిబాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *