-హనుమజ్జయంతి నాకెంతో ప్రియమైన రోజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అతులిత బలధాముడు, అంజనీదేవి పుత్రుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడు, సకల గుణ సంపన్నుడైన శ్రీ హనుమానుని జయంతి తనకెంతో ప్రీతికరమైన రోజు అని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు బుధవారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన పూజాది కార్యక్రమాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. తొలుత ఆలయ ప్రాంగణంలో 20 గంటల పాటు నిర్విఘ్నంగా వెలుగుతూ.. సువాసనలు వెదజల్లే భారీ అగర్ బత్తిని వెలిగించారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవస్థానం నందు ధూప దీప నైవేధ్యాలతో పూజలు నిర్వహించారు. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు మహా బలవంతుడు, పరాక్రమశాలి అని.. అంతకుమించి శ్రీరామచంద్రునికి పరమభక్తుడిగా దాస్యభక్తిని చాటారన్నారు. శ్రీ రామనామస్మరణ ఎక్కడ జరిగితే అక్కడ హనుమంతుల వారు కొలువై ఉంటారని, ఆవిధంగా ఆంజనేయుడు మనమధ్యే ఉన్నారని చెప్పారు. స్వామి వారి జీవితంలో ధైర్యం, వివేకం, సంయమనం ప్రధానంగా కనిపిస్తాయన్నారు. ఎవరైతే ఆ ప్రసన్నాంజనేయుని మనసారా సేవిస్తారో వారికి అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయని పేర్కొన్నారు. అతులిత బలధాముని దివ్య ఆశీస్సులు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని.. ఆ స్వామి కృపా కటాక్షాలతో ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి అంగిరేకుల నాగేశ్వరరావు గొల్లభామ, డివిజన్ కో ఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు, ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, ఈవో నాగినేని భవానీ, పాలకమండలి సభ్యులు కగ్గా పాండురంగారావు, యర్రంశెట్టి శ్రీను, కోలా సూరాంబ, యక్కల మారుతి, మధుబాబు, బండి నాగజ్యోతి, బాడిత సత్యవతి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.