-ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయో మెట్రిక్ హాజరు నమోదు తప్పనిసరి
-పీహెచ్సీ పరిధిలో డెలివరీలు చేపట్టాలి.. వైద్యులకు సిబ్బందికి సూచనలు చేసాము
-కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను అభివృద్ధి చేయడం తోపాటు అక్కడ ఉత్తమ వైద్య సేవలను అందించడం పై సూచనలు చేశామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పి హెచ్ సి లో ప్రజలకు అందచేస్తున్న వైద్య పరీక్షలు, సేవలు, తదితర అంశాలపై సమాచారం తెలుసుకున్నారు. ప్రతి ఒక్క వైద్య సిబ్బంది తప్పనిసరిగా బయో మెట్రిక్ హాజరు వేయాలన్నారు. సమయపాలన పాటించడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం ఆసుపత్రులలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాలు, సిబ్బంది మెరుగు పరచడం జరిగిందని, ఆ దిశలో ఆసుపత్రుల్లో మెరుగు పరచి వసతులను క్షేత్ర స్థాయి పరిశీలించడం జరిగిందన్నారు. పీహెచ్సి, సిహెచ్సి ల్లో డెలివరీ కేసులు చేపట్టాలి, ఆ దిశలో మహిళలకు మనో ధైర్యం కల్పించాల్సి ఉందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. పి.హెచ్.సి., సి.హెచ్.సి పరిధిలో ఉన్న గ్రామాల్లోని గర్భిణీ స్త్రీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాటికి ఆయా కేంద్రాల్లో డెలివరీ కేసులు నమోదు చేసి, చేపట్టాలన్నారు. ఇందుకోసం సమగ్ర వివరాలు సేకరించాలన్నారు. ఆయా కేంద్రాల్లో మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకం ప్రజల్లో, గర్భిణీస్త్రీలకి కలుగచేసి మనో ధైర్యం పెంచాల్సి ఉందన్నారు. డెలివరీ కేసులను రాజమహేంద్రవరం లోని జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేస్తే ఎలా అని మీ మీ ఆసుపత్రులలో సమర్థవంతంగా సేవలు అందించాలన్నారు. క్లిష్టమైన కేసులను మాత్రమే జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చెయ్యాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీ లో వైద్యాధికారి డా.రవిచంద్ర, వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.