-ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూలు జిల్లాను బ్రహ్మంగారి పేరుమీద నామకరణం చేయాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. బుధవారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి, ప్రధాన కార్యదర్శి గోకవరపు శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు పాదయాత్రలో వాగ్ధానం చేసినటువంటి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి వారి వాగ్థానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. నూతనంగా ఏర్పడిన కర్నూలు జిల్లా రవ్వలకొండ, బనగానపల్లి ప్రాంతాలకు శ్రీశ్రీశ్రీ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. పంచవృత్తు (కమ్మరం, కంచరం, వడ్రంగం, శిల్పం, స్వర్ణకార వృత్తులు) లలో వున్న విశ్వబ్రాహ్మణులకు పంచకార్పొరేషన్స్ ఏర్పాటుచేయడంతోపాటు కుల వృత్తులకు క్లస్టర్స్ ఏర్పాటుచేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా మంగళసూత్రాలను విశ్వబ్రాహ్మణ స్వర్ణకార్లకు మాత్రమే చేసేలా జీవోను వెంటనే అమలు చేయాలన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆదుకొని నిధులు కేటాయించాలన్నారు. విశ్వబ్రాహ్మణ మహిళలకు ఆర్థిక చేయూత కల్పించాలనే తదితర డిమాండ్స్‌ను తెలిపి వాటి అమలుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి, ప్రధాన కార్యదర్శి గోడి అరుణల, కృష్ణాజిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రమేష్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు, స్వామివారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …