-33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు..
-పరీక్షకు హాజరు కానున్న 13,785 మంది అభ్యర్థులు..
-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జూన్ 5వ తేదిన యుపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు యుపిఎస్‌సి ఉన్నతాధికారులకు వివరించారు. జూన్ 5వ తేదీన యుపిఎస్‌సి ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై యుపిఎస్‌సి ఉన్నతాధికారులు నిర్వహించిన గూగుల్ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు బుధవారం ఆయన కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుపిఎస్‌సి పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు 13,785 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 1,332 మంది ఇన్వెజిలేటర్లను, 33 మంది సూపర్‌వైజర్లను, 94 మంది అసిస్టెంట్ సూపర్‌వైజర్లను నియమించామన్నారు. జూన్ 5వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, మ.2:30 గంటల నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్స్‌గా ఈ పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. పటమట కెబిసి జిల్లా పరిషత్ బాయిస్ హైస్కూల్‌లో 58 మంది విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్తు సరఫరా, శానిటేషన్‌పై సంబంధిత శాఖలను అదేశించామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు యుపిఎస్‌సి ఉన్నతాధికారులకు గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.