విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఖరీఫ్ కాలానికి రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులను సిద్దం చేసి పంటలు వేసేలా సమాయత్తం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి యం విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే రైతులు పంటలు వేసే విధంగా విత్తనాలు, ఎరువులను సిద్దం చేశామన్నారు. ఖరీఫ్ పంట కాలానికి లక్ష 4వేల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం అంచనా కాగా ఇప్పటికే 32,600 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్ పంట కాలానికి అవసరమయ్యే 24 వేల మెట్రిక్ టన్నుల ఎరువులలో 3 వేల మెట్రిక్ టన్నులు రైతుభరోసా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్దం చేశామన్నారు.రైతులు తమకు కావాల్సిన ఎరువల ఇండెట్లను స్థానిక రైతుభరోసా కేంద్రాల విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ముందుగా తెలియజేయాలని, తద్వారా జాప్యం లేకుండా అవసరమయ్యే ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే వైఎస్సార్ రైతుభరోసా పథకంలో పెట్టుబడి ఖర్చులకు మొదటి విడతగా లక్ష 21 వేల 711 మంది రైతులకు 66.94 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశారన్నారు. భూసారాన్ని పెంచే విధంగాను పశువుల ఎరువుకు పత్యామ్నాయంగా 50శాతం రాయితీతో 4529 క్విటాళ్ల జీలుగ, 2577 క్వింటాళ్ల పిల్లిపెసర, 108 క్వింటాళ్ల జనుము, మొత్తంగా 7214 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రైతుభరోసా కేంద్రాలలో పంపిణీకి సిద్దంగా ఉంచామన్నారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించి యాత్రీకరణలో భాగంగా రైతుభరోసా కేంద్రాల స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల్‌ను ఏర్పాటు చేసి పంపిణీకి సిద్దంగా ఉంచామన్నారు. 33,458 మంది కౌలుదారులకు పంట సాగు దృవపత్రాలను జారీ చేశామని జిల్లా వ్యవసాయాధికారి యం విజయభారతి ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …