విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జిల్లాలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ సంబంధిత యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటకరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ కోన శశిధర్‌లకు వివరించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాల అమలుపై గురువారం పంచాయతీరాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ కోన శశిధర్‌లు సచివాలయం నుండి రాష్ట్రలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలం జూపూడి, మైలవరం మండలం వెల్వడం గ్రామాలను సంపూర్ణ పారిశుద్ద్య గ్రామాలుగా గుర్తించామన్నారు. స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పారిశుద్ద్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఇంటింటి నుండి తడి పొడి చెత్తలను వాహనాల ద్వారా సేకరించి ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు తరలించి అక్కడే ప్రొససింగ్ చేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియను ప్రతీ రోజు గ్రేడ్ `5 సెక్రటరిలు సంబంధిత యాప్ నందు నమోదు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జగనన్న స్వచ్చ సంకల్పంలో భాగంగా చెత్త సేకరణ రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో ప్రొససింగ్ తదితర కార్యకలాపాలను ఎప్పటికప్పుడు యాప్ నందు అప్‌లోడ్ చేయాలన్నారు. దీనిపై నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సమన్వయంతో నూరు శాతం చేత్తను సేకరించే విధంగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో గ్రామ సచివాలయాల పరిధిలో నిర్మిస్తున్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని వారంవారిగా నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపుర్ అజయ్, డిపివో కె. పూర్ణ చంద్రశేఖర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఎన్. వి. వి. సత్యనారాయణ ఉన్నారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …