విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం హనుమజ్జయంతి ముగింపు వేడుక ఘనంగా జరిగాయి. గత నాలుగు రోజులుగా జరుగుతున్న హనుమాన్ జయంతి కార్యక్రమాలతో దాసాంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీగా జరిగిన అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, స్వామి కృపా కటాక్షాలతో ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, ఈవో నాగినేని భవానీ, పాలకమండలి సభ్యులు కగ్గా పాండురంగారావు, యర్రంశెట్టి శ్రీను, కోలా సూరాంబ, యక్కల మారుతి, మధుబాబు, బండి నాగజ్యోతి, బాడిత సత్యవతి, కమిటీ సభ్యులు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, బాలి గోవింద్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొనగా, భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి దర్శనానంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ స్వీకరించారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …