రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ సాగు చేసే పంట కొనుగోలు చేసిన తర్వాత మిల్లింగ్ అయినా బియ్యం నాణ్యత పరిశీలించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు గ్రామంలో SWC గోడౌన్ ఆకస్మికంగా జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్భికెలు ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం మిల్లింగ్ అనంతరం ఎఫ్ సి ఐ గో డౌన్ కి చేరుకోవడం జరుగుతుందన్నారు. ఆ బియ్యం నాణ్యత ప్రమాణాలు కలిగిఉన్నది లేనిది క్వాలిటీ కంట్రోల్ అవసరమన్నారు. గ్రేడ్ ఏ, కామన్ వెరైటీ బ్రోకెన్ శాతం 15 వరకు, డామేజ్ 1.5 శాతం, చల్కీ గ్రైన్స్ ఒక శాతం, ఎర్ర గింజ 3 శాతం, యాడ్ మిక్సర్ గ్రేడ్ ఏ లో 6 శాతం వరకు ఉండ వచ్చు నన్నారు. అదేవిధంగా డి,- హస్కీడ్ గ్రైయిన్ 10 శాతం, moisture శాతం 14 శాతం ఉండవచ్చునని తెలిపారు. మిల్లర్ లు ఈ రబీ సీజన్లో పండిన పంటను ఎఫ్ సి ఐ కి తరలిస్తున్నరా లేదో చూసుకోవాలని తెలిపారు. స్టాక్ ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసి నమూనా సేకరణ చెయ్యాలని ఆదేశించారు. నాణ్యత, బరువు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యహరించాలన్నారు. జేసీ వెంట ఏ ఎస్ ఓ భాస్కర్, గో డౌన్ సిబ్బంది ఉన్నారు.
Tags rajamendri
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …