-నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి
-లక్ష్య సాధనలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు
-కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భవనాలు పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. మాధవి లత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాఠశాలల్లో నాడు నేడు, హౌసింగ్, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లు, హెల్త్ క్లినిక్ భవనాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో ఇంకా గ్రౌండింగ్ కాకుండా పెండింగ్ లో ఉన్న భవనాలను గ్రౌండింగ్ చేసి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నాడు నేడు భవన నిర్మాణాల తో పాటు ఇతర మౌలిక సదుపాయాల పనులను కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిగురువారం రాష్ట్ర స్థాయి అధికారులు ఈ అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నందున క్షేత్ర స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇంకా 15 సచివాలయాలు, 52 ఆర్.బి కేంద్రాలు, 91 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ సెంటర్ల భవనాలను గ్రౌండ్ చేయవలసి ఉందని, అధికారులు వెంటనే వాటిని గ్రౌండ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండింగ్ చేసిన ప్రతి పనిలో పురోగతి తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
నిర్దేశించిన లక్ష్యాలు సాధించటంలో ఏ ఒక్క అధికారి అలసత్వం వహించిన అటువంటి అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిస్తూ ప్రభుత్వ భవన నిర్మాణాల పురోగతి లో నిర్దేశించిన లక్ష్యాలను ఎందుకు సాధించలేక పోతున్నారని ప్రశ్నించారు. నాడు – నేడు ద్వారా నిర్మించే భవనాలకు, జగనన్న కాలనీల్లో నిర్మించే గృహ నిర్మాణాలకు ఇసుక, సిమెంట్ స్టీల్ అందుబాటులో ఉన్నాయని ఈ మేరకు అధికారులు వారికి నిర్దేశించిన వారం వారం లక్ష్యాలను సాధించాలన్నారు. అందులో భాగంగా మెటీరియల్ ను ముందస్తు గా డంప్ చేసుకోవాలన్నారు. మండలాల్లో పులింగ్ చేసిన మెటీరియల్ అంశాల వారిగా సమిక్షిస్తూ, వర్షాకాలము నిర్మాణాలకు మెటీరియల్ రవాణా ఇబ్బందులు లేకుండా ఆయా ఇంఛార్జి అధికారులదే భాధ్యత అని స్పష్టం చేశారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా హౌసింగ్ అధికారి బి తారాచంద్ , డిఎంహెచ్ఓ డా. ఏం. స్వర్ణలత, డీ ఈ ఓ ఎస్. అబ్రహం, డి ఎ ఓ ఎస్.మాధవరావు, పంచాయతీరాజ్ యస్సీ ప్రసాద్ , హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎం ఈ ఓ లు, తదితరులు పాల్గొన్నారు