రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు పౌర సేవల ను అందించడంలో సచివాలయాలు, రైతులకు భరోసా గా అర్భికెలలో పనిచేసే సిబ్బంది నిబద్దతతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కొండగుంటురు రైతు భరోసా కేంద్రం, సచివాలయం, సంపత్ నగర్ సచివాలయం ను జేసీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సచివాలయం లో సిబ్బంది పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హజరును పరిశీలించి, సాయంత్రం 3 నుంచి 5 గంటలు వరకు సచివాలయంలో కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు. కొండగుంటురు అర్భికే లో జూన్ ఒకటి నుంచి సాగునీరు అందిస్తున్న దృష్ట్యా రైతులలో చైతన్యం తీసుకుని రావాలని, ఈ అర్భికే లో ఉన్న గ్రామాల్లో సాగు చేసే రైతుల వివరాలు తెలుసుకుని వారికి జూన్ ఒకటి తర్వాత విత్తనాలు నాటు కోవడం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ వెంట తహశీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, సచివాలయ, అర్భికే సిబ్బంది ఉన్నారు.
Tags rajamendri
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …