-అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకు చేర్చుటయే లక్ష్యంగా అవగాహన కల్పించాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
61వ డివిజన్ పరిధిలోని 262 సచివాలయ పరిధిలో క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్వహించిన కార్యక్రమము కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. పరిశీలించి వివరాలను అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. వివిధ సంక్షేమ పధకములు, ప్రజలకు అందించు వివిధ రకాల సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించు ఉద్దేశ్యముతో ప్రతి నెలా చివరి శుక్ర, శని వారములలో నిర్వహించు సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమము శుక్రవారం నగరపాలక సంస్థ పరిధి నందలి అన్ని సచివాలయములలో జరిగింది.
సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమములో మిగిలిన అన్ని కార్యక్రమములతో పాటు మొదటి విడత గృహ లబ్దిదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమము చేపట్టాలనే కమిషనర్ వారి ఆదేశాల మేరకు అందరు శాఖాధిపతులు వార్డు సచివాలయ ప్రత్యేక అధికారులు సిబ్బందితో కలసి క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క లబ్దిదారునికి ప్రభుత్వo ద్వారా విలువైన స్థలము అందించుటయే కాక రోడ్డు, డ్రైయిన్లు, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనతో ఆహ్లాదకర వాతావరణంలో దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఆస్తి సమకూర్చబడుతోందని, ప్రతి ఒక్కరూగృహ నిర్మాణమునకు ముందుకు రావలయునని, అబివృద్ధి చేసిన లేఔట్ నందలి గృహనిర్మాణ చిత్రములను లబ్దిదారులకు చూపించి సమగ్రంగా వివరించారు.
గృహ నిర్మాణ విషయంలో ఆర్ధికముగా సహకరించుటకు స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయం కల్పించబడుచున్నవని తెలియజేయుటతో పాటుగా వారికి గల సందేహాలను నివృతి చేయడమైనది. నగరంలో అన్ని సచివాలయాల పరిధి నందు వార్డ్ వాలoటిర్లు వారి వారి క్లస్టర్ యందు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకములు, ప్రజా సేవలు, నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై అవగాహన కల్పించుట, ప్రభుత్వ సంక్షేమ పథకముల క్యాలెండర్ ప్రకారం ఏయే నెలలో ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను మరియు సేవల వివరములు, సమస్యల పరిష్కారము కొరకు సంప్రదించవలసిన సచివాలయ సిబ్బంది ఫోన్ నెంబర్లను తెలియచేసినారు. నగరపాలక సంస్థ పరిధిలోని గృహ నిర్మాణాల లేఔట్ స్థలములను ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి, ఇంకను చేపట్టవలసిన అభివృద్ధి పనులపై తగు కార్యాచరణ చేపట్టారు.