-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. క్షేత్ర స్థాయి పర్యటనలో శుక్రవారం అధికారులతో కలసి సర్కిల్ -3 పరిదిలో పలు ఇంజనీరింగ్ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. పటమట నిర్మలా హై స్కూల్ రోడ్, రామలింగేశ్వర నగర్ కట్ట, అమ్మ కళ్యాణ మండపం రోడ్, పి.వి.పి, చెన్నుపాటి పెట్రోల్ బంక్ తదితర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబందించి నూతనంగా వేసిన రోడ్ల యొక్క స్దితిగతులు, ఎత్తు పరిమాణం మరియు పనుల యొక్క నాణ్యతను రీబౌండ్ హ్యామర్ తో స్వయంగా పరిశీలించారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబందించి నిర్మాణ పనులకు సంబందించి నాణ్యత విషయంలో తగు శ్రద్ధ వహించవలెనని, వాడుకలో మెటిరియాల్ నందు ఎప్పటికప్పుడు క్వాలిటి పరీక్షలు చేయించవలెనని, ప్రజల మరియు వాహనముల రాకపోకలకు ఎటువంటి అసౌకర్యo కలుగకుండా చర్యలు తీసుకోని, పనుల అన్నియు నిర్దేశిత వ్యవదిలో పూర్తి అగునట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పై ప్రాంతాలలో డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల విధానము, పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించిన సందర్భంలో నిర్మలా కాన్వెంట్ రోడ్ ఫుట్ పాత్ లపై ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకుండా చూడాలని అన్నారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.