విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మైలవరం మండలం వెల్వడం గ్రామ పర్యటన అనంతరం నగరంలోని కలెక్టరేట్‌కు చెరుకునే ప్రయాణంలోనే జిల్లా కలెక్టర్ డిల్లీరావు గృహానిర్మాణాల ప్రగతిపై స్పెషల్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో నియోజకవర్గాలలో మంజూరై నిర్మాణాలు జరుపుకుంటున్న పనుల ప్రగతిని సమీక్షించారు. గృహా నిర్మాణాల పనులు ఊపందుకునేలా స్పెషల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. వారం వారిగా నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. మంజూరై ఇంకనూ ప్రారంభం కాని వాటిని లబ్దిదారులతో ఒప్పించి గృహాలు ప్రారంభింప చేయాలన్నారు. అన్ని గృహాలు బెస్‌మెంట్ స్థాయికి తీసుకురావాలని, నిర్మాణ పనుల వివిధ దశలు పూర్తి అయిన వెంటనే బిల్లులను అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణపై స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, లబ్దిదారులకు పెండిరగ్ లేకుండా అందుబాటులో ఉంచాలన్నారు. జగనన్న కాలనీల్లో గృహా నిర్మాణాలు చివరి దశకు వచ్చిన చోట సిసిరోడ్లు, డ్రైనేజ్, ఇంటింటి కుళాయి తదితర సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని స్పెషల్ ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …