-జిల్లా విద్యాశాఖాధికారి రేణుక,పర్యవేక్షకులు శ్రీనివాసాచార్యులు వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర జవహర్ బాలభవన్ సంచాలకులు మరియు ప్రత్యేక అధికారి బి . సాయి రామ్ ఆదేశాలమేరకు రాష్ట్ర బాల భవన్ నందు “వేసవి శిక్షణా శిబిరం” నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి వి రేణుక, బాల భవన్ పర్యవేక్షకులు ఆర్ బి శ్రీనివాసాచార్యులు ఓ సంయుక్త ప్రకటలో తెలిపారు. .ఈ వేసవి శిక్షణ శిబిరం విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబాగుడి వద్ద గల బాల భవన్ లో జూన్ 7వ ,2022 తేదీ నుండి నిర్వహిస్తామన్నారు.. కేవలం రూ. 50 నామమాత్రపు ఫీజుతో ఏడాదంతా సంగీతం, వీణ, డ్రాయింగ్ లలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్ల నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ శిక్షణలో తర్ఫీదు ఇస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న శిక్షణ శిబిరంలో 210 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారన్నారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు 20 రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరం ఉదయం 7:30 నుండి 10:30 వరకు సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు విజయవాడ నగరంలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ వినియోగించుకొని మన భారతీయ సాంస్కృతిక కళల పట్ల అవగాహన మరియు సృజనాత్మకతను పెంపొందించుకోవాల్సిందిగా కోరారు. ఈ కళ లు నేర్చుకోవడానికి పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సి వి రేణుక మరియు బాల భవన్ పర్యవేక్షకులు శ్రీనివాసాచార్యులను సెల్ నెంబర్ 9398111183లో సంప్రదించాల్సిందిగా కోరారు.