Breaking News

ఎమ్మెల్యే చేతులమీదుగా వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పంపిణీ

-అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో పెన్షన్ అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 62వ డివిజన్ న్యూ పాయకాపురంలో వైఎస్సార్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్లపైనే చేయడం జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్నికలకు 3 నెలల ముందు ఓట్ల కోసం పింఛన్ పెంచితే.. ఈ ప్రభుత్వం మూడేళ్ల పాటు పెంచిన పింఛన్ ను వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, డయాలసిస్ పేషంట్లకు అందించిందని వివరించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లను ఇచ్చిందని.. కానీ ఈ ప్రభుత్వంలో 62 లక్షల మందికి పైగా అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నెలకు రూ. 1,570 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది దాదాపు నాలుగు రెట్లు అధికమన్నారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలో 18 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను.. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25 వేలకు పెంచడం జరిగిందన్నారు. ఒక్క 268వ సచివాలయ పరిధిలోనే 322 మందికి ప్రతినెలా రూ. 8.35 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు ఇతర లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వాలంటీర్లు వెళ్లి పింఛన్‌ డబ్బును అందజేస్తున్నారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో భర్త ఉన్న మహిళలకు కూడా జన్మభూమి కమిటీలు లంచాలు పుచ్చుకుని వితంతు పింఛన్లు ఇచ్చి ఇష్టానుసారంగా దోచుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా గుమ్మం వద్దకే పింఛన్ ను అందిస్తున్నట్లు వివరించారు. ఐటీ రిటర్న్స్, 4 చక్రాల బండి, అధిక కరెంట్ బిల్లుల కారణంగా ఆగిపోయిన పింఛన్లను అర్హతను బట్టి 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా ఈ జూన్ మాసంలో అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, డివిజన్ కోఆర్డినేటర్ వీరబాబు, నాయకులు మస్తాన్, రామిరెడ్డి, బోరా బుజ్జి, పద్మ, రెడ్డెమ్మ, హైమావతి, గ్రేసీ, అధికారులు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *