-జిల్లా కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉపాధి హామీ పని దినాల్లో మరింత ప్రగతి చూపాల్సి ఉందని, పిడి డ్వామా, ఎంపిడివో లు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి నూరు శాతం లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి క్షేత్ర స్థాయిలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తదుపరి సమావేశం నాటికి జిల్లాలో సాధించవలసిన లక్ష్యాలలో స్థిరమైన ప్రగతి చూపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు. పనిదినాలు, సగటు వేతనం పై ముఖ్యమంత్రి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారని అందుకు అనుగుణంగా అధికారులు పనితీరు మెరుగు పరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పని దినాల్లో మరింత ప్రగతి చూపాల్సి ఉందని, పిడి డ్వామా, ఎంపిడివో లు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి నూరు శాతం లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాలనీల్లో డ్రైనేీజీ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చెయ్యడం జరిగిందన్నారు.
వివిధ భవన నిర్మాణ పనులపై సమీక్ష
సచివాలయ భవనాలు, అర్భికే లు, హెల్త్ క్లినిక్ , డిజిట లైబ్రేరీ భవనాలు, అమూల్, బల్క్ మిల్క్ యూనిట్స్, తదితర భవన నిర్మాణానికి సంబంధించి తదుపరి పురోగతి లేకపోవడం పై ముఖ్యమంత్రి సమీక్షించారని పేర్కొన్నారు. బీబీఎల్, బిఎల్, స్లాబ్ లెవెల్, కంప్లీషన్, వంటి స్థాయిల్లో కూడా తదుపరి కార్యాచరణ పై కూలంకుషంగా సమీక్షించారని తెలిపారు. ఆయా నిర్మాణాల్లో ప్రగతి లేకపోతే ఆయా జిల్లాల్లో పనులు జరగటం లేదని భావించవలసి వస్తుందని పేర్కొన్నందున అధికారులు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణం పై సమీక్షిస్తూ, కోర్టు కేసులు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అనుసంధాన రహదారి, లేవిలింగ్ పనుల్లో భాగంగా పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాల కోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.35 వేలు రుణం మంజూరు కి చొరవ చూపాలని సూచించారు. 90 రోజుల హౌసింగ్ కార్యక్రమం పై సమీక్షించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. అనపర్తి, బిక్కవోలు పరిధిలో ప్రతిపాదించిన ఇళ్ళ స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించగా, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మాధవీలత పేర్కొనడం జరిగింది. తదుపరి సిఎం సమీక్షిస్తూ టిడ్కో ఇళ్ళ ప్రగతి, మౌలిక సదుపాయాలు పై దృష్టి పెట్టడం, బ్యాంకర్, మెప్మా , మునిసిపల్ కమిషనర్ లకు దిశా నిర్దేశం చేశారు. వారం వారం ప్రగతి పై సమీక్ష చెయ్యాలని, లబ్దిదారులు, బ్యాంకర్స్ తో సమావేశాలు నిర్వహించేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. జగనన్న భూహక్కు- భూరక్ష పథకం సర్వే కి సంబంధించి ఫేజ్ లు వారీగా తొలిదశ, రెండవ దశ, మూడో దశలకు సంబందించిన డేట్ లైన్స్ ముఖ్యమంత్రి ప్రకటించారు.
స్పందన పిర్యాదులు, పరిష్కరించినవి, పరిష్కారం కానివి, ఎస్ ఎల్ ఏ (రాష్ట్ర స్థాయి సగటు) లోపల పరిష్కారం చేస్తున్న వాటిపై సిఎం సమీక్షిస్తూ, తిరిగి వస్తున్న ఫిర్యాదుల పై సమీక్ష చెయ్యడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి తో పాటు మండల, మునిసిపల్, గ్రామ, వార్డు సచివాలయం వరకు పిర్యాదులు స్వీకరించి పరిష్కారం కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జగనన్న గోరు ముద్ద, వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ, తదితర పధకాలపై సమీక్షించారు. వైద్య, విద్య రంగాల్లో స్థిరమైన వృద్ది సాధించాలని, జాతీయ స్థాయిలో ఆయా రంగాల్లో ప్రగతి ని పర్యవేక్షణ చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో చూపే ప్రగతి రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబిస్తాయని, స్పష్టం చేసిన దృష్ట్యా మరింత నిబద్దతతో పనిచేయాల్సి ఉందన్నారు. వ్యవసాయ అభవృద్ధి సలహా మండలి సమావేశం అర్భికే స్థాయిలో ప్రతి మొదటి శుక్రవారం, మండల స్థాయిలో 2వ శుక్రవారం, జీల్లా స్థాయి లో 3వ శుక్రవారం విధిగా సమావేశం నిర్వహించి, ఆయా సమావేశాల్లో చర్చించిన అంశాలతో నివేదిక రూపొందించి కలెక్టర్ లు సమగ్ర నివేదిక, విత్తనాలు, ఎరువులు పంపిణీ విషయంలో పారదర్శకం గా ఉండాలని స్పష్టం చేశారు. డిమాండ్ కు అనుగుణంగా పంపిణీ చేయాల్సి ఉందని, కలెక్టర్లు సమగ్ర పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాలని సిఎం పేర్కొన్నారు. ఈ క్రాప్ బుకింగ్, ఈ క్రాప్ కటింగ్, ప్యాడి కొనుగోళ్లు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.