రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటి నిర్మాణాలు ప్రగతి చూపాలని, బేస్మెంట్ స్థాయి క్రింద ఉన్న వాటిని ప్రగతిగా పరిగణించడం జరగదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు. బుదవారం సాయంత్రం రాజానగరం మండలం నందరాడ లో లే అవుట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం కోసం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రెయిన్లు లను యుద్ద ప్రాతిపదికపై చేపట్టాలన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణాల ప్రగతిలో దశల వారీగా పనుల స్థాయిని సమీక్షించడం జరుగుతోందని పేర్కొన్నారు. బేస్మెంట్, లింటల్, స్లాబ్ , ఇంటి నిర్మాణం పూర్తి దశకు చేరుకునే ప్రతి దశ విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి సమీక్ష చేస్తున్నారని ఆమె తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరగాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రూ.35 వేలు అదనపు రుణాన్ని అందచేసి త్వరితగతిన పూర్తి చేస్తే, ప్రభుత్వం కూడా దశల వారీగా నిర్మాణ ఖర్చులు లబ్దిదారుల ఖాతాకు జమచేస్తుందని మాధవీలత తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు ఇసుక, సిమెంట్, ఐరన్ కోసం ఇండెంట్ పెట్టి లే అవుట్ లలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. విధుల్లో భాధ్యత లేకుండా ప్రవర్తిస్తే శాఖాపరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిన పలువురు లబ్దిదారులతో కలెక్టర్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డి ఈ జి సోములు, రాజనగరం తాసిల్దారు బాల సుబ్రహ్మణ్యం ఎంపీడీవో మూర్తి హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …