Breaking News

జిల్లాలో ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, స్పందన ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు.
ఉపాధిహామి, జగనన్న కాలనీ గృహా నిర్మాణ పనులు, స్పందన ఆర్జీల పరిష్కారం, జగనన్న భూహక్కు భూరక్ష పథకం తదితర అంశాలపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో నగరంలోని కలెక్టర్‌ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ పాల్గొన్నారు.
వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన, ఏపి సేవా పోర్టల్‌లో నమోదైన ఆర్జీలను నూరుశాతం పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆర్జీలు పెండిరగ్‌ ఉన్న స్థాయిని గుర్తించి ఆయా అధికారులతో ఎప్పటికప్పడు టెలీ, జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమస్యల పెండిరగ్‌కు తగిన కారణాలను తెలుసుకుని వాటిని పరిష్కరించేలా సూచనలు ఇస్తున్నామని తెలిపారు. గృహానిర్మాణాలకు సంబంధించి లేఅవుట్లలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. గృహానిర్మాణాలు చేపట్టని లబ్దిదారులతో సమవేశాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గృహా నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక. సిమ్మెంట్‌, ఐరన్‌ ఇతర సమాగ్రిని లేఅవుట్లలో, లబ్ధిదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో జరుగుతున్న రీ సర్వే పనులను, జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకంలో రిజిస్ట్రేషన్‌ పెండిరగ్‌ లేకుండా నిర్థేశించిన వ్యవధిలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ముందుగానే సాగునీటిని విడుదల చేస్తున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను చైతన్యవంతులను చేయడంతోపాటు విత్తనాలు, ఎరువులు పురుగుమందులు సిద్దంగా ఉంచినట్లు జిల్లా కలెక్టర్‌ వివరించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 1,06,423 మంది కూలీలకు పనిదినాలను కల్పించి అభివృద్ధి పనులను చేబడుతున్నట్లు కలెక్టర్‌ వివరించారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *