Breaking News

సమగ్ర భూ సర్వే, ఒటిఎస్‌, జగనన్న కాలనీ భూ సమస్యల పరిష్కారం పై ఆలసత్వం తగదు…

-గడువులోగా సమస్యలు పరిష్కరించకుంటే చర్యలు తప్పవు..
-జిల్లా ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సమగ్ర భూ సర్వే ఒన్‌టైమ్‌సెటిల్‌మెంట్‌ (ఒటిఎస్‌) జగనన్న కాలనీలకు సంబంధించి కోర్టులో పెండిరగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో జాప్యాన్ని సహించబోనని గడువులోగా సమస్యలను పరిష్కరించకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సంబంధిత తహాశీల్థార్లను హెచ్చరించారు.
జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంలో సమగ్ర భూముల రీసర్వే, జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం (ఒటిఎస్‌), జగనన్న కాలనీ లేఅవుట్లకు సంబంధించిన కోర్టు కేసులు తదితర అంశాల పై జిల్లా కలెక్టర్‌ యస్‌డిల్లీరావు బుధవారం కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి ఆర్‌డివోలు, యంపిడివోలు, తహాశీల్థార్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ స్థాయిల్లో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీటిలో భాగంగా గ్రౌండ్‌ ట్రూతింగ్‌, అన్‌లైన్‌ పోర్టల్‌లో డేటా ఎంట్రీ, 13 నోటీఫికేషన్‌, ఎల్‌పియం జనరేషన్‌, హక్కు పట్టా పంపిణీ తదితర ప్రక్రియలకు నిర్థేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. ఇందుకు సంబంధించి వారంలోగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేసుకోవాల్సివుంటుందని కలెక్టర్‌ ఆదేశించారు.
జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం (ఒటిఎస్‌) రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన 32,049 డాక్యుమెంట్లను తహాశీల్థార్లు అమోదించగా వీటిలో 22,560 రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌ అన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వాటిని త్వరితతగిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు, వీఆర్‌వోలు, యంపిడివోలు, తహాశీల్థార్లు సమన్వయంతో కార్యచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేసుకోవాలన్నారు. నిర్థేశించిన 15 రోజులలోపు పూర్తి చేయాలని దీనిపై రోజువారి టెలీ, వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు.
జగనన్న కాలనీ భూములకు సంబంధించి కోర్టు కేసులపై సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, మండల తహాశీల్థార్లను, గ్రామాల వారిగా ఉన్న ప్రతీ కోర్టు కేసును కలెక్టర్‌ సమీక్షించారు. కేసులను పూర్తి స్థాయిలో కూలకుషంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేసులకు సంబంధించి ఇప్పటివరకు పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ కోరారు.

వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌ అన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *