-సలహాలు, అభ్యంతరాల నమోదుకు జూన్ 8 వరకు గడువు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ నీటి అవసరాల కోసం మైదుకూరు RTPP సప్లై లైన్ నుండి చేపట్టనున్న 800 ఎం.ఎం. డయా DI-K9 పైప్ లైన్ డిజైన్, సప్లై, నిర్మాణ పనుల ప్రక్రియపై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) ఇంజనీర్ ఇన్ చీఫ్ సీ.హెచ్.ఎస్. శ్రీనివాస ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మైదుకూరు నుండి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ నీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణలో భాగంగా పైప్ లైన్ డిజైన్, నిర్మాణం, నీటి సరఫరా పనులతో పాటు 3 సంవత్సరాల నిర్వహణకు సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (RFP)ను గుంటూరులోని గౌరవ న్యాయమూర్తి, జ్యుడీషియల్ ప్రివ్యూకి ఏపీఐఐసీ సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు, ఔత్సాహిక బిడ్డర్లు, సాధారణ ప్రజలు సదరు పనులపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలుంటే www.apiic.in వెబ్ సైట్ ద్వారా గానీ లేదా 1) judge-ipp@ap.gov.in 2) apjudicialpreview@gmail.com కు మెయిల్ చేయడం ద్వారా జూన్ 8వ తేది సాయంత్రం 5 గంటల లోపు జ్యూడీషియల్ ప్రివ్యూ కమిటీకి తెలియజేయాలని ఏపీఐఐసీ ఈఎన్‌సీ సీ.హెచ్.ఎస్. శ్రీనివాస ప్రసాద్ ఆ ప్రకటనలో కోరారు.