Breaking News

వెటర్నరీ డాక్టర్లను విధులలోనికి తీసుకోవాలి…

-ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ పశు వైద్య సంచార వాహనాలు లో పనిచేస్తున్న వెటర్నరీ డాక్టర్లను తమ విధులు నుంచి తొలగించిన విషయమై అలాగే గత నాలుగు రోజులుగా వారు తెలియజేస్తున్న నిరసన, డిమాండ్లు గురించి బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేఖర్ల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఏపీ.వి.ఎస్.జి.ఏ అధ్యక్షుడు ఎమ్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవుట్సోర్స్ విధానం లో మొబైల్ వెటర్నరీ క్లినిక్ పనిచేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ మేము నిర్వహించిన ధర్నాకు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి తమ మద్దతును తెలియజేస్తూ మా ప్రభుత్వం వస్తే అవుట్ సోర్సింగ్ విధానాన్ని పక్కనపెట్టి ప్రభుత్వమే తీసుకొని ప్రత్యక్ష పద్ధతిలో మొబైల్ నిర్వహిస్తామని చెప్పడం జరిగిందన్నారు. అదే విషయాన్ని ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్ వ్యవస్థ వస్తుందని తమకు సమాచారం ఉన్నప్పుడు ఉన్నత అధికారులకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలను, అవుట్సోర్స్ విధానంలో మొబైల్ వెటర్నరీ క్లినిక్ నడిపిస్తే రైతులకు తమకు ఎలాంటి నష్టాలు జరుగుతాయి అన్న విషయాన్ని పదే పదే విన్నవించడం జరిగిందన్నారు. అయితే చివరగా ఉన్నత అధికారులు ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. వేతనాల విషయంలో తిరోగమన దిశలో ఉన్న మముల్ని ఈ వ్యవస్థను వ్యతిరేకిస్తూ తాము నిరసన తెలియజేయడం తో ఉద్యోగాల నుంచి నిర్ధాక్షణ్యంగా తొలగించడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నెరవేర్చాలని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ వి ఎస్ జి ఏ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *