విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ కు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆహ్వానం అందించారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన సుబ్బారెడ్డి ఆలయ వివరాలను తెలిపారు. ఈ నెల 4నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గవర్నర్ కు స్వామివారి కార్యక్రమ ఆహ్వాన పత్రిక, ప్రసాదాలు అందజేసారు. కార్యక్రమంలో జేఈవో వి.వీరబ్రహ్మం, రాజ్ భవన్ ఉప కార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …