Breaking News

వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో ఘనంగా విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను ది. 1 జూన్ 2022 (బుధవారం) నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విడదల రజని (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమ, వైద్య విద్యా శాఖామాత్యులు) మరియు గౌరవ అతిధులుగా వుండవల్లి శ్రీదేవి (తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు), వెంకటరమణన్ వేణుగోపాల్ (డైరెక్టర్, ఎలక్ట్రికల్ డిజైన్ సాఫ్ట్వేర్, ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ ) హాజరయ్యారు.
ముఖ్య అతిదిగా  విడదల రజని (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంభ సంక్షేమ, వైద్య విద్యా శాఖామాత్యులు) విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. తదుపరి మహాత్మాగాంధీ అకాడెమిక్ బ్లాక్ లోని ఇన్నోవేషన్ అండ్ ఇన్కుబేషన్ సెంటర్ (IIC) మరియు సెంటర్స్ అఫ్ ఎక్సల్లెన్స్ ఇన్ ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ & రోబోటిక్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీలను ప్రారభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకొని, ఆ లక్ష్య సాధించేందుకు కృషి చేసి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియచేసారు. ప్రభుత్వం విద్యకు అత్యదిక ప్రాథాన్యత ఇచ్చిందని, అందులో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలియచేసారు. వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయ రెండవ గ్రాడ్యుయేషన్ బ్యాచ్ విద్యార్థులు 635 సూపర్ డ్రీం మరియు డ్రీం ఆఫర్లతో మొత్తం 1321 ప్లేస్ మెంట్ ఆఫర్లను సాధించటం అభినందనీయమని తెలియచేసారు.
గౌరవ అతిధి  వుండవల్లి శ్రీదేవి (తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు) మాట్లాడుతూ గురువుల ప్రాముఖ్యతను తెలియచేసారు. అంతే కాకుండా VIT అంటే Vision, Innovation , Transformation అని అన్నారు.
గౌరవ అతిధి వెంకటరమణన్ వేణుగోపాల్ (డైరెక్టర్, ఎలక్ట్రికల్ డిజైన్ సాఫ్ట్వేర్, ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ ) మాట్లాడుతూ వైఫల్యాలే రేపటి విజయాలకు సోపానాలని, కాబట్టి ఓడిపోయినా ధైర్యంతో ముందుకు సాగితే విజయాలు సాధించవచ్చని తెలియచేసారు. ఖాళీ సమయాలలో కొత్త విషయాలు నేర్చుకోవటం, పుస్తకపఠనం చేయటం వల్ల ఒత్తిడిని జయించవచ్చని తెలియచేసారు.
విఐటి వ్యవస్థాపకుడు మరియు ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ మాట్లాడుతూ విఐటి నాలుగు క్యాంపస్ లలో దాదాపు 65 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, అత్యుత్తమ విద్య విధానాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందింస్తున్నామని, విద్యార్థులు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనమని తెలియచేసారు. వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యాలయంలో 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 దేశాల నుండి 7888 మంది విద్యార్థులు మరియు 23 రాష్ట్రాల మరియు విదేశాల నుండి అధ్యాపకులతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉండటం సంతోషంగా ఉందని అన్నారు. 81 క్లుబ్బులు మరియు చాప్టర్ లతో విద్యార్థులను ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని పొందటానికి మరియు సమగ్ర విద్యను అందించటానికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభినందించారు.
ఇన్నోవేషన్ అండ్ ఇన్కుబేషన్ సెంటర్ (IIC) ను 10,000 స్క్వేర్ ఫీట్ ఏరియా లో ఏర్పాటు చేసామని ఇందులో 6 స్టార్టుప్లు (ఎనర్జీ ఎఫిసియెంట్ బైక్, ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్, ముఖం అప్ , స్మార్ట్ ఆగ్రో, సోషల్ డిస్టెన్సిన్గ్ అలెర్ట్ సిస్టం, యాంటి సూసైడ్ ఫ్యాన్ రాడ్) ఉన్నాయని తెలియచేసారు.
వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ 148 అకాడెమిక్ అవార్డులు, 13 ఎండోమెంట్ అవార్డులు, 143 అధ్యాపకులకు, రీసెర్చ్ స్కాలర్స్కు రీసెర్చ్ అవార్డులు, 42 సిబ్బందికి పెర్ఫార్మన్స్ అవార్డులు అవార్డులు సాధించిన విద్యార్ధులు, అధ్యాపకలు మరియు సిబ్బందిని ప్రశంసించారు అంతే కాకుండా 5 సంవత్సరాల సర్వీస్ ను పూర్తిచేసిన 31 మంది అధ్యాపకులు, 3 సిబ్బందిని సత్కరించారు.
విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా||. ఎస్.వి. కోటా రెడ్డి విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను చదివి విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు. ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ & రోబోటిక్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ లలో సెంటర్స్ అఫ్ ఎక్సల్లెన్స్ లు ఉన్నాయని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| సిఎల్వి శివకుమార్, డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) డా|| అనుపమ నంబూరు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *