విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడం అంతర్జాతీయ ప్రయాణాలు పునఃప్రారంభించడంతో, పాస్‌పోర్ట్ లు , పాస్‌పోర్ట్ సంబంధిత సేవల కోసం దరఖాస్తులు అకస్మాత్తుగా పెరిగాయి, ముఖ్యంగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC), విద్య, వలస, ఉపాధి వంటి వివిధ ప్రయోజనాల కోసం మన పౌరులకు ఇది అవసరం.
కోవిడ్-19 అనంతర సమయంలో విదేశాలలో కార్యాలాపాలు తిరిగి ప్రారంభమవ్వడం వల్ల పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లకు భారీ డిమాండ్ పెరిగింది. దీని ప్రకారం, స్లాట్‌ల డిమాండ్, నియామకాల కోసం సుదీర్ఘ పరిశీలన ప్రక్రియ ప్రారంభించింది.
అయితే, ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం విశాఖపట్నం, విజయవాడ రెంటికీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ -PCC తక్షణ అవసరం ఉన్న దరఖాస్తుదారుల అభ్యర్థనలను సకాలంలో పొందడంలో దరఖాస్తుదారులకు సహాయం చేయడానికి గత రెండు నెలలుగా వారి అపాయింట్‌మెంట్‌లను ముందుగానే పరిశీలించడం ద్వారా అభ్యర్థనలను సులభతరం చేస్తున్నాయి. ఈ సమయంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం పెద్దఎత్తున ఒకే దశ ద్వారా సంప్రదింపులు సంతృప్తికరంగా అందుకోలేము.
విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల ఉపాధి అవకాశాలు,వృత్తి అవసరాలు దృష్టిలో ఉంచుకుని, RPO, విశాఖపట్నం, విజయవాడ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారంలో ఒక రోజును ప్రత్యేక PCC రోజుగా నిర్వహించాలని నిర్ణయించింది (బుధవారం) అంటే., 08.06.2022,15.06. 2022 & 22.06.22 తేదీల్లో PCC ఆశావహుల తక్షణ అవసరాలను పరిష్కరించడానికి, తద్వారా వారి ఆసక్తులమేరకు పరిశీలనలు చేయగలం.
విజయవాడ, వైజాగ్ ఆర్పీఓ డి.ఎస్.ఎస్. శ్రీనివాసరావు పిసిసి నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్లాట్ బుకింగ్‌ల కోసం ఏ ఏజెంట్‌లను సంప్రదించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏ ఏజెంట్‌ను ఆ ప్రయోజనం కోసం నియామకం చేయలేదని పునరుద్ఘాటించారు. అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.in లేదా mPassportseva యాప్. ద్వారా మాత్రమే సాధ్యం.
దరఖాస్తుదారులు సంబంధిత పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ముందస్తు అపాయింట్‌మెంట్‌తో PSK, వైజాగ్, విజయవాడ తిరుపతిలకి హాజరు కావాలని అభ్యర్థించారు. అపాయింట్‌మెంట్ లేని దరఖాస్తులు స్వీకరించరని పాస్ పోర్టు అధికారి డి ఎస్ ఎస్ శ్రీనివాసరావు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …