-హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్, విజయవాడ వేదికగా కార్యక్రమం నిర్వహించనున్న ఆదాయపు పన్ను శాఖ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించు కొని నిర్వహిస్తున్న “ఆజాదీకా అమృత్ మహెూత్సవ్ ఉత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి లో 06 జూన్, 2022 నుంచి 11 జూన్, 2022 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 06/06/22 తారీఖున ఉదయం 10 గంటల ముప్పై నిమిషాలకు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన భవన్ నుండి కేంద్ర ఆర్థిక మంత్రి సమక్షంలో ప్రారంభించ నున్నారు.
ప్రధానమంత్రి కార్యక్రమం ముందుగానే షెడ్యూల్ చేయబడింది. 06.06.2022, నాడు డిజిటల్ ఎగ్జిబిషన్‌తో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా భారతదేశం అంతటా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో క్రిస్టల్ బాల్ రూమ్, 2 వ అంతస్తు, ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్, M.G.రోడ్, విజయవాడ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి పత్రికా ప్రకటనను Dy.కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, A.T.K.MURTHY ఈ రోజు విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి ప్రారంభమై 12 గంటల వరకు జరుగనుంది. ది. ఈ కార్యక్రమంలో CBDT, CGST, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ICAI, బ్యాంక్ అధికారులు పాల్గొనున్నారు.
ఈ ఉత్సవం భారత దేశం లోని 75 ప్రధాన నగరాలలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం చేయబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆధ్వర్యాన దేశంలో ఇప్పటి వరకూ అమలు చేసిన పాలనా పరమైన సంస్కరణలనీ, తద్వారా దేశం లోని ఆర్థిక రంగం లో జరిగిన అభివృద్ధి మరియు దేశ ఆర్థికాభివృద్ధి యొక్క క్రమానుగత పరిణామాన్ని ఇందులో ప్రదర్శిస్తారు. సంవత్సర, సంవత్సరానికీ ఆర్థిక శాఖ కనపరచే అద్భుతమైన పనితీరును స్థూలంగా వివరించే, “డిజిటల్ ” ప్రదర్శనను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. అదే విధంగా “ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ” (AKAM) లోగో ముద్రించి ఉన్న, వేరు వేరు డినామినేషన్స్ గల ఐదు కాయిన్స్ ను, ప్రత్యేక ఎడిషన్ గా ఆయన విడుదల చేస్తారు. అదే విధంగా “జన సమర్ద్ ” అనే పేరు గల ఒక ఏకీకృత జాతీయ పోర్టల్ ను, ఆయన ఈ సందర్భంగా లాంచ్ చేస్తారు. ఈ పోర్టల్ క్రెడిట్ లింక్డ్ (ఆధారిత), ప్రభుత్వ పథకాల నన్నిటినీ ఒక క్లిక్ తో తెలుసుకో గలిగే సౌలభ్యాన్ని సౌకర్యాన్ని లబ్దిదారుల కు కలుగ జేస్తుంది. ఈ పోర్టల్ లో లాగ్-ఇన్ అవడం ద్వారా లబ్దిదారులు ఆయా పథకాలన్నిటి పూర్తి సమాచారాన్ని అర్హత ల పూర్తి వివరాలను తక్షణమే పొంది, ఆన్లైన్ లోనే వాటికి వెంటనే అప్లయ్ చేసుకోవచ్చు. దేశ దైనందిన ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో ఆర్థిక అంశాలు చేర్చేందుకు గల ప్రాముఖ్యత గురించి ఈ కార్యక్రమం లో ప్రధానంగా ప్రస్తావిస్తారు. వేగవంతమైన పరిపూర్ణమైన దేశాభివృద్ధి వైపు ప్రధాన మంత్రి మనను ఏవిధంగా పురోగమింపజేస్తూన్నారో తెలిపే ఒక లఘు చిత్రం సైతం ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు.
అరుణ్ జైట్లీ ఆర్థిక వ్యవహారాల బోధనా సంస్థ, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కస్టమ్స్ మరియు పరోక్ష పన్నుల విభాగం, మరియు ప్రత్యక్ష పన్నుల విభాగం వంటి సంస్థలు కార్పొరేట్ వ్యవహారాలశాఖ మరియు ఆర్థిక శాఖ ఆధ్వర్యాన, జూన్ 6 వ తేదీ నుండి 11 వ తేదీ వరకూ అనేక ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రకాశ వంతమైన, భారతీయ సాంస్కృతిక, జాతీయ, వైజ్ఞానిక వారసత్వ అభివృద్ధికై, “ఆత్మ నిర్భరతా భారత్ ” స్ఫూర్తితో ఇండియా 2.0 ను ఉత్తేజ పరిచే విధంగా ప్రధాని దార్శనికత తో ఇప్పటి వరకు జరిగిన సమగ్రమైన అభివృద్ధి యొక్క పరిణామం లో కీలక భాగస్వామ్యు లైన ప్రజలందరికీ ఈ ఉత్సవం అంకిత మివ్వడం జరుగుతుంది. 12 మార్చ్ 2021 న మొదలైన ఈ సాధికారిక 75 వారాల “ఆజాదీకా అమృత్ మహోత్సవ్” ఉద్వేగ పూరిత ప్రయాణము, 75 వ స్వాతంత్ర్య దినోత్సవానికి సమీపిస్తోంది. వచ్చే సంవత్సరం 15 ఆగస్ట్ 2023 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో ఇది ముగుస్తుంది.