విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతిని కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన భాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ యస్‌డిల్లీరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆదివారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్, డిఆర్‌వో కె మోహన్‌కుమార్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని నీరు, నేల, గాలిని కలుషితం చేయొద్దని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి గ్లోబల్‌వార్మింగ్ అంతకంతకు ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల మండల కేంద్రాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు, సచివాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల పరిసరాలలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ఆదేశించామని కలెక్టర్ అన్నారు. రోజురోజుకు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేవిధంగా మొక్కలు నాటాలని కలెక్టర్ డిల్లీరావు విజ్ఞప్తి చేశారు. ప్రకృతిని కలుషితం చేయకుండా కాపాడుకుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరక్షించి సమాజ భవిష్యత్తుకు పాటుపడాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. అనంతరం తహాశీల్థార్లు, కలెక్టరేట్‌లోని వివిధ సెషన్ల అధికారులు, సిబ్బందితో పర్యావరణాన్ని పరిరక్షిస్తానని కలెక్టర్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్ ప్రతిజ్ఞ చేయించారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …