Breaking News

ఓ టి ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించాలి

-ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి మూడు అంకెల ప్రగతి చూపాలి
-కలెక్టర్ డా. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటిఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే విధానంలో విధి విధానాలపై మండల అధికారులు , సిబ్బంది పూర్తిగా అవగాహన అవసరమని, విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం గృహ నిర్మాణం, ఓ టి ఎస్, ఉపాధిహామీ, ఎస్.డబ్ల్యు.పి.సి. షెడ్‌ల, రెండవ దశ ఎం.పి ఎఫ్.సి. గోడౌన్ల భూమి గుర్తింపు పై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు జిల్లా, రెవెన్యూ, మండల స్థాయి, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటిఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ లు పూర్తి చేసే అవకాశం ఉన్న వాటి వివరాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎమ్.పి డి.ఓ, ఈవోపిఆర్డి, తహశీల్దార్లు నిర్దేించబడిన లక్ష్యాలను ఈరోజే పూర్తి చేయాలన్నారు. ఓటిఎస్ లక్ష్యాలలో 3605 లో సాయంత్రం నాలుగు గంటల వరకు సుమారు 1400 మేర లక్ష్యాలను మాత్రమే సాధించడంపై ప్రశ్నిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు రాత్రికి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రీ రిజిస్ట్రేషన్ వివరాలు ఆన్లైన్ లో ప్రతిబిబించాలన్నారు. హౌసింగ్ నిర్మాణాలను మరింత వేగం చెయ్యాలని, బుధవారం నాటికి లక్ష్యాలలో మూడు అంకెల ప్రగతి చూపాల్సి ఉందని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ప్రతి గురువారం రాష్ట్ర అధికారులు చేసే సమీక్షకు బుధవారం సాయంత్రం వరకు చేసిన ప్రగతి ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలిపారు. ప్రతి వారం ఇళ్ల నిర్మాణ పనులలో దశల వారీగా ప్రగతి చూపాలని చెప్పినా క్షేత్ర స్థాయిలో ఆదిశలో అడుగులు వేయడం లేదని అన్నారు.

ఉపాధి హామీ పనులు రోజు జిల్లాలో లక్ష మ్యాండి డేస్ సాధించాల్సి ఉంటుందని, ఐతే కొన్ని మండలాలు 60%, 70% మేర మాత్రమే సాధించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మే నెల లక్ష్యంలో 85% మాత్రమే జిల్లా ప్రగతి లక్ష్య లను సాధించడం జరిగిందని పేర్కొన్నారు. నల్లజర్ల, గోపాలపురం మండలాలు లక్ష్యాలను సాధించాక పోవడం వల్ల జిల్లా ప్రగతిపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. గత నెల బ్యాక్ లాగ్ మ్యండిడేస్ ఈనెల టార్గెట్ తో కలిపి పూర్తి చేయాలన్నారు. జిల్లా లో రోజు సాధించాల్సిన లక్ష పనిదినాల అన్ని మండలాలకు సమానంగా లక్ష్యం నిర్దేశించా మన్నారు. దేవరపల్లి మండలం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్ ఆర్ ఈ జి ఎస్ లబ్దిదారులకి బ్యాంకు ఖాతాల నిర్వహణ కోసం బ్యాంకర్ ముందుకు రాకపోతే , ప్రజలకు అందుబాటులో లేని బ్యాంకు సేవలపై సంబంధించిన వివరాలతో ని నివేదిక ఇవ్వాలని, వేరే బ్యాంకులో ఖాతాలు ప్రారంభించాలని ఎంపీడీఓ లను ఆదేశించారు. ఎస్ డబ్ల్యు పి సి షేడ్స్ ద్వారా ఆదాయ వనరులు గా అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా నిర్మాణాలు ప్రారంభం కానీ ఎస్ డబ్ల్యు పి సి షేడ్స్ పనులు చేపట్టి, పనులు పూర్తి చేయాలన్నారు. భవన నిర్మాణానికి సంబంధించి పెండింగ్ 84 ఆరోగ్య కేంద్రాలు, 44 అర్భికే లు, 16 సచివాలయం భవనాలు బేస్మెంట్ స్థాయికి శనివారం నాటికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో రెండవ దశ లో 57 ఎం.పి ఎఫ్.సి. గోడౌన్ల నిర్మాణం కోసం భూమి గుర్తింపు చేయాలని , అందులో భాగంగా మంగళవారం నాటికి రాజమండ్రి, కొవ్వూరు డివిజన్ నుంచి మూడు చొప్పున స్థల సేకరణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ సిహెచ్, శ్రీధర్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *