-హోం మంత్రి శ్రీమతి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు అనగా 06-06-2022 న కొవ్వూరు అసెంబ్లీ పరిధిలో గల 14 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులతో విభాగ సహకార అధికారి వారి కార్యాలయంలో కొవ్వూరు నందు ఆ సంఘముల యొక్క వ్యవహారముల పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రస్తుత ప్రభుత్వం సహకార వ్యవస్థను పటిష్టం చేసి అన్ని రకాల సదుపాయాలను, సేవలను ద్వారా అందిస్తోంది. అన్ని సదుపాయాలను ఒకే చోట అందే విధముగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ ఏర్పాటు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందిందని, ప్రతి సంఘ అధ్యక్ష కార్యదర్శులు సంఘ సభ్యత్వాన్ని పెంచి ప్రతి సభ్యునికి అన్ని రకాల సదుపాయాలు సహకార సంఘాల ద్వారా అందే విధంగా కృషి చేయాలని కోరారు. సంఘములో అన్నీ సమర్థవంతమైన ఆఫీసులను మరియు బిల్డింగులను కలిగి ఉండాలని దానికి కావలసిన అన్ని సదుపాయం ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విభాగ సహకార శాఖ సిబ్బంది మరియు సంబంధిత సంఘ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.