-కలెక్టరేట్ లో ఆర్ అండ్ బి నాడు నేడు ఫోటో ప్రదర్శన
-జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత
రాజమహేంద్రవారం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా రూ. 114 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన ద్వారం హాల్లో ఆర్ అండ్ బి శాఖ ద్వారా జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి సంబంధించిన నాడు – నేడు ఫోటో ప్రదర్శన ను తిలకించిన జిల్లా కలెక్టర్ మాధవిలత ఆర్ అండ్ బి శాఖ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్ అండ్ బి పరిధి లో గల 40 పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 114 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు జిల్లాలో ఇప్పటి వరకు రూ.50 కోట్ల రూపాయలతో 13 పనులు పూర్తి చేశామన్నారు. ఇందులో స్టేట్ హైవే రహదారులు 12, జిల్లా రహదారులు 28 కాగా నియోజక వర్గం రహదారులు 7 ఉన్నాయన్నారు. అదేవిధంగా జిల్లాలో 250 కి.మీ. నిడివి గల రహదారుల పునరుద్దనకోసం ఆర్ అండ్ బి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రహదారులు మరియు భవనాల శాఖ ఈఈ ఎస్ బి వి రెడ్డి, డీఈఈ బి.వి.మధుసూదనరావు, ఏఈఈలువి.కిరణ్ కుమార్,కె.నంద కిషోర్, జి.వీరన్నబాబు,యు. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.