Breaking News

బాలల సంక్షేమమే సమసమాజ స్థాపన… : అనూరాధ


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయిలో ప్రతి గ్రామ వార్డుల లో బాలల స్నేహపూర్వక సమాజం తీర్చిదిద్దాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ. ఆర్. అనూరాధ స్థానిక ఏలూరు రోడ్డు లోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ నందు సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిషన్ యొక్క కార్యక్రమాలను అందరూ ఉపయోగించుకుంటే బాలలపై జరిగే హింసను నిర్మూలించవచ్చని, అంతేకాకుండా క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయం లో పని చేస్తున్న వార్డు అసిస్టెంట్లు మరియు మహిళ సంఘాల యొక్క సేవలను ఉపయోగించుకొని ప్రతి గ్రామంలో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కమిటీ సభ్యుల ద్వారా బాలల సమస్యలను గుర్తించి వెంటనే డి.సి.పి.యు బాలల సంక్షేమ సమితి దృష్టికి తీసుకు వచ్చి బాలల ఎదుగుదలలో ఏమైనా సమస్యలు ఉంటే గుర్తించి వెంటనే ఆయా బాలలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆమె అన్నారు.రాష్ట్ర స్థాయిలో ఉన్న బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ కోసలి అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని సభ్యులు, అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ , మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ రైట్స్ ఫౌండేషన్ ల వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేసే డి సి పి యు హక్కుల పరిరక్షణ చట్టం పరిరక్షించుటకు అందరూ కలిసి సమానంగా పనిచేయాలని ఆయన కోరారు. గ్రామస్థాయి సమభాగస్వామ్య విశ్లేషణ ద్వారా చైల్డ్ లైన్ సర్వే నిర్వహించి బాలల యొక్క సమస్యలను గుర్తించి వాటిని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించే విధంగా చర్చలు జరిపి కమిషన్ చర్యలు తీసుకునే విధంగా అమలు చేయాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో కమిషన్ తరఫున “బాలల సంక్షేమ పోర్టల్” ఏర్పాటు చేసి తక్షణమే స్పందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో సమస్యలు వచ్చినప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ మరియు సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వారి దృష్టికి తీసుకువెళ్లి బాలల సమస్యలను పరిష్కరించుటకు మనమందరం నడుం బిగించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అయినా “నాడు నేడు”, ” అమ్మ ఒడి”, ” జగనన్న గోరుముద్ద”, ” వైయస్సార్ కంటి వెలుగు”, ” జగనన్న దీవెన విద్య దీవెన”, “జగనన్న వసతి దీవెన” తదితర బాలల సంక్షేమ పథకాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా బాలలకు అమలు జరిగేటట్లు చూడాలని, చట్టపరంగా యాక్ట్ లు అన్ని సంపూర్ణంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సి. ఆర్ .ఏ .ఎఫ్ ఫ్రాన్సస్, సభ్యులు గొండు. సీతారాం, టి .ఆదిలక్ష్మి, జంగం. రాజేంద్ర ప్రసాద్ మరియు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో బాలల సంక్షేమ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *