Breaking News

ఉపాధి హామి పనులలో జిల్లాదే అగ్రస్థానం…

-జూన్‌ మాసాంతానికి మరో 20 లక్షల పని దినాలు కల్పింద్దాం..
-జాప్యం లేకుండా కూలీలకు వేతనాల చెల్లించేలా చర్యలు తీసుకోండి..
-రోజుకు కనీస వేతనం రూ.257 లభించేలా పని కల్పించాలి..
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఉపాధి హామి పనులను వేగవంతం చేసి జూన్‌ మాసాంతానికి మరో 20 లక్షల పని దినాలను కూలీలకు కల్పించి రోజుకు కనీసం 257 రూపాయలు వేతనం లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు జి. కొండూరు మండలంలో పర్యటించి తిరుగు ప్రయాణంలో ఉపాధి హామీ పనుల ప్రగతిపై డ్వామా పిడి, యంపిడివోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి హామి ద్వారా కూలీలకు జిల్లాలో ఇప్పటివరకు 33.87 లక్షల పని దినాలను కల్పించడం ద్వారా ఎన్‌టిఆర్‌ జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలపడం గర్వకారణం అన్నారు. అయితే లక్ష్యాలను మించి కూలీలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలలో 30 లక్షల పనిదినాలు కల్పించాలనే ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాన్ని అధిగమించి 33.87 లక్షల పనిదినాలను కల్పించామన్నారు. జూన్‌ మాసాంతానికి మరో 20 లక్షల పని దినాలను కల్పించాలనే అదనపు లక్ష్యాలను నిర్ణయించామని కలెక్టర్‌ తెలిపారు. రానున్న వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీటి విడుదుల వంటి సందర్భాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్యాలను అధిగమించేలా ముందుకు వెళ్లాలన్నారు. కూలీలకు ప్రభుత్వం నిర్థేశించిన కనీస వేతనం 257 రూపాయలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్థేశించిన కొలతల ప్రకారం పనిచేయడం, పనివేళలను పాటించడం, వేతనానికి సరిపడ కూలీలను సమకూర్చుకోవడం వంటి విషయాల పై కూలీలలో అవగాహన కల్పించిన్నప్పుడు కనీస వేతనం పొందగలుగుతారన్నారు. ఈ విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను అధిగమించాలన్నారు. కూలీలకు వేతనాలు చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజులకు సంబంధించిన కూలీల హాజరు, పనికి చెక్‌ మేజర్‌మెట్స్‌ చేసి యంపిడివోలకు సమర్పించాలని ఆదివారం నాడు వాటిని అప్‌లోడ్‌ చేసి సోమవారం తుది నివేదికను సమర్పించడం పూర్తి చేసి సకాలంలో వేతనాలు చెల్లించేలా సంబంధిత అధికారులను కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *