-జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయల వ్యవస్థ ద్వారా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయాలని జాయింట్ కలెక్టర్ యస్ నూపూర్ అజయ్ అన్నారు.
మంగళవారం నందిగామ మండలం మదురరోడ్డు`1, పెద్దవరం, లింగాలపాడు సచివాలయాలను జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి సక్రమంగా అందించే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలన్నారు. సచివాలయానికి వచ్చే ఆర్జీలను తక్షణం పరిష్కరించి పారదర్శకంగా సేవలిందించాలన్నారు. సచివాలయాలలోని సంక్షేమ పథకాల క్యాలెండర్, సిబ్బంది హాజరు పట్టిని, ఇతర రిజిస్ట్రర్లను ఆమె పరిశీలించారు.గ్రామాలలో పారిశుద్ద్యం మెరుగుపరచాలని, తడి, పొడి చెత్త వేరు చేసి తమ ఇంటికి వచ్చిన పారిశుద్ద్య కార్మికులకు అందజేసే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆమె సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ ఆర్‌్‌డివో కార్యాలయంలో నందిగామ మండలంలో నిర్వహిస్తున్న జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం, జగనన్న కాలనీ లేఅవుట్ ప్రగతి పై ఆర్‌డివో, యంపిడివోలు, నందిగామ మున్సిపల్ కమీషనర్, డిటిలతో సమీక్ష నిర్వహించారు. జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం పై ప్రజలలో అవగాహన కల్పించాలని, జగనన్న కాలనీలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. లబ్దిదారులతో సమావేశం నిర్వహించాలని లబ్దిదారులో డ్వాక్రా సంఘ సభ్యులకు 35 వేల రూపాయల వరకు రుణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు అధికారులతో సమావేశంల నిర్వహించి మిగిలిన లబ్దిదారులకు జగనన్న కాలనీ ఇళ్ల పట్టాలపై 35 వేల రూపాయలను వ్యక్తిగత రుణం మంజూరు చేసేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ ఆదేశించారు. సమావేశంలో ఆర్‌డివో రవీంద్రబాబు, నందిగామ మున్సిపల్ కమీషనర్ జయకుమార్, యండివో అరుంధతి దేవి తదితరులు పాల్గొన్నారు.