విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నూపూర్ అజయ్ అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం సూరంపల్లిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హౌసింగ్ లేఅవుట్ ను మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. లే అవుట్ లో ఇసుక ,సిమెంట్, ఐరన్ తో పాటు అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Tags vijayawada
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …