-త్వరితగిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి
-కమిషనర్ కె.దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న గృహాల లబ్ధిదారులు అందరూ వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపునే బేస్ మెంట్ వర్క్ నూరుశాతం పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ ఆదేశించారు. వెలుగుబంద లో మంగళవారం జగనన్న ఉచిత గృహాల సముదాయాన్ని సందర్శించి, మౌలిక సదుపాయాలపై చేపడుతున్న పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉచిత గృహాల సముదాయ లే అవుట్ కాలనీల్లో రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించి పనులను చేపట్టడం జరుగుతోందన్నారు. సచివాలయ ఎమినిటీస్ సెక్రెటరీ లతో ప్రతి వారం పనుల పురోగతి పై సమీక్ష చేశామని అన్నారు. ఎమినిటీస్ సెక్రెటరీ ల వద్ద తమ పరిధి లోని వంద గృహ లబ్ది దారుల పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలన్నారు. ఇంకనూ ఎవరైనా లబ్ధిదారులు పనులు మొదలు పెట్టక పోతే, వారితో మాట్లాడి, ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు, ప్రోత్సాహకాలు గురించి వివరించి ఇళ్లు నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణ పనులు మొదలెట్టేలా చూడాలన్నారు. ఎ. డి.సి కృష్ణవేణి,సెక్రెటరీ కాళీబాబు, హోసింగ్ డి ఈ లు తదితరులు పాల్గొన్నారు.