-మొట్ట మొదటి సారిగా కబడ్డీ లో కాంస్య పతకం సాధించిన బాలికల జట్టు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అండర్-18 (బాలురు మరియు బాలికల) విభాగములో ఈ నెల 3వ తేది నుండి 13 వ తేది వరకు హర్యానాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లో భాగముగా ఆంధ్రప్రదేశ్ నుండి వెయిట్ లిఫ్టింగ్ బాలికల 64 కేజిల విభాగములో యస్. పల్లవి ఫైనల్స్ లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కి తొలి బంగారు పతకం సాధించింది. అలాగే అథ్లెటిక్స్ లో భాగంగా 400 మీటర్స్ పరుగు పందెంలో కుంజా రజిత 1వ స్థానం లో నిలిచి బంగారు పతకం, యం. శిరీష 3వ స్థానం లో నిలిచి కాంస్య పతకం సాధించారు. అలాగే కబడ్డీ బాలికల జట్టు సెమీస్ లో హర్యానా పై 50-15 తో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది.. . ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ కబడ్డీ మహిళల జట్టు పతకం సాధించటం ఇదే మొట్ట మొదటి సారి, అలాగే వెయిట్ లిఫ్టింగ్ 49కేజి ల విభాగము లో డిజి. వీరేష్ రజత పతకం, అలాగే ఘాట్కా సింగిల్ సొట్టి టీమ్ విభాగములో బాలురు జట్టు 2వ స్థానం కోసం జరిగిన పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టు హర్యానా పై 142-125 తో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించిన సందర్భంగా శాప్ విసి & యం.డి డా. నక్కల ప్రభాకర రెడ్డి, శుభాకాంక్షలు తెలియజేశారు.