Breaking News

జూన్ 9న‌ విశాఖపట్నంలో “ఆశావాహ‌ జిల్లాల జోనల్ సమావేశం”

-ముఖ్య అతిధిగా హాజ‌ర‌వ్వ‌నున్న‌ కేంద్ర మ‌హిళా మ‌రియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి, స్మృతి జుబిన్ ఇరానీ
-ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాల్గొననున్న ప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
75వ స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకోబుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో రాబోయే 25 సంవ‌త్స‌రాలకు దేశం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే విధంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (WCD) దేశవ్యాప్తంగా 4 జూన్ 2022 నుంచి 09 జూలై, 2022 వ‌ర‌కు జోనల్ మరియు సబ్-జోనల్ స్థాయిలో స‌మావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భాగంగా 09 జూన్, 2022 న‌ విశాఖపట్నంలో “ఆశావాహ‌ జిల్లాలపై జోనల్ సమావేశం” జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ‌ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల నుంచి అధికారులు, ప్ర‌తినిధులు పాల్గొననున్నారు.

కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి స్థానిక‌ పార్లమెంటు సభ్యులు, ద‌క్షిణాది రాష్ట్రాలకు చెందిన‌ సాంఘిక సంక్షేమ / మహిళా మరియు శిశు శాఖల మంత్రులు హాజరవుతారు. విశాఖ ప‌ట్నం జిల్లాకు చెందిన రాష్ట్ర శాసనసభ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొంటారు. మహిళా మరియు శిశు అభివృద్ధి / సాంఘిక సంక్షేమ శాఖ‌ల ప్రధాన కార్యదర్శులు/ కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఉన్న‌తాధికారులు కూడా సమావేశానికి హాజరవుతారు. జిల్లా పరిషత్/పంచాయత్, NCW, SCWలు, NCPCR, SCPCRలు మరియు ప్రపంచ బ్యాంక్, UNICEF, UN మహిళలు మరియు పౌర సమాజ సంస్థల వంటి అంతర్జాతీయ ఏజెన్సీల అధిపతులు ఈ కార్య‌క్ర‌మానికి హాజరయ్యే అవ‌కాశం ఉంది.

భారతదేశంలోని మహిళలు మరియు పిల్లల సాధికారత కోసం నూత‌నోత్తేజంతో, నిబద్ధతతో, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మూడు కొత్త మిషన్‌లను ప్రారంభించింది – మిషన్ సక్షం అంగన్‌వాడీ & పోషణ్ 2.0, మిషన్ శక్తి మరియు మిషన్ వాత్సల్య. మిషన్ సక్షం అంగన్‌వాడీ & పోషణ్ 2.0 మహిళలు మరియు పిల్లల పోషకాహార సమృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది, మిషన్ శక్తి మహిళల భద్రత, పునరావాసం మరియు సాధికారత కోసం సమగ్ర పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది . మిషన్ వాత్సల్య శిశు సంక్షేమం మరియు పిల్లల రక్షణతో సహా సమగ్ర అభివృద్ధికి తోడ్ప‌డ‌నుంది.

సమావేశపు ముఖ్యోద్దేశం గ‌తంలో సాధించిన ల‌క్ష్యాలను గుర్తుచేసుకోడ‌మే కాకుండా వాటి స్ఫూర్తితో రానున్న కాలంలో మహిళలు మరియు పిల్లల అభివృద్ధి కి, సాధికారత దిశ‌గా మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేయ‌బోతున్న‌ నిరంతర కృషిని తెలియ‌జేయ‌డం.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *