-శానిటరీ సెక్రెటరీలకు పలు ఆదేశాలు – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ 57వ డివిజన్ పరిధిలోని 234, 236 మరియు 237 సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క పని విధానము మరియు సచివాలయములలో ప్రజలు అందించు సమస్యల అర్జీలపై తీసుకొనుచున్న చర్యలను పరిశీలించి సిబ్బందికి పలు ఆదేశాలు ఇస్తూ, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. తదుపరి 236 మరియు 237 సచివాలయ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా జరుగుతున్న గ్యాంగ్ వర్క్ పనులను శానిటరీ సెక్రెటరీలతో కలసి పరిశీలిస్తూ, మెరుగైన పారిశుధ్య చర్య అమలుపరచి పరిసరాలు అన్నియు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా ప్రతి నిత్యం క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అదే విధంగా డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదలకు అవరోధం కలిగిస్తూన డ్రెయిన్ నందలి వ్యర్ధములను ఎప్పటికప్పుడు తొలగించి మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని ఆదేశించారు. పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డా.రామకొటేశ్వరరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.