-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో కోర్టు వాజ్యాల వల్ల పెండింగ్ లో ఉన్న లే అవుట్ ల సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న వాటిని బెంచ్ పైకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో రాజమహేంద్రవరం, కొవ్వూరు రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలిసి కలెక్టర్ లే అవుట్ ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు, మధ్య ఆదాయ వర్గాల కుటుంబాలకు ఇంటి స్థలాలు అందజేసి సొంత ఇంటి కల నెరవేర్చినందుకు అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చెయ్యడం జరుగుతోందన్నారు. పేదలకు ఇళ్లను , పరిశ్రమలు, ఇతర పథకాల కోసం స్థలాలను గుర్తించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమాంతరంగా చేపడుతున్నా మన్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు డివిజన్ పరిధిలో ల్యాండ్ సంబంధ సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేసి సంబందించిన శాఖలకు స్థలాల అప్పగించాల్సి ఉందన్నారు. భూ సంబంధ పెండింగ్ కోర్టు కేసుల విషయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న వాటిని బెంచ్ పైకి వచ్చేలా లీగల్ నోడల్ అధికారిని పంపి ప్రభుత్వ న్యాయవాది ని కలిసి మాట్లాడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో లు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, హౌసింగ్ డి ఈ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.