తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో పాల్గొనడానికి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఘన స్వాగతం లభించించింది. జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి , జెసి బాలాజి , ఎస్పీ పరమేశ్వర రెడ్డి, మహిళా విశ్వవిద్యాలయం ఉప కులపతి జమున , శ్రీకాళహస్తి ఆర్డీఓ హరిత , తదితరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు తిరుమల శ్రీవారిని దర్సించుకుని సాయంత్రం 5.00 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియంలో జరగనున్న స్నాతకోత్సవంలో పాల్గొని రాత్రి 7.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి గవర్నర్ తిరుగుప్రయాణం కానున్నారు. గవర్నర్ వెంబడి రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు ఉన్నారు.
Tags tirupathi
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …