తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా విజ్ఞానం అందించాలని రాష్ట్ర గవర్నరు మరియు కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో ఆచార్య యన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52వ మరియు 53వ స్నాతకోత్సవo వేడుకలను శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట అతిధి మరియు ఉపన్యాసకులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.
స్నాతకోత్సవ సమావేశంలో కులపతి మరియు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మాట్లాడుతూ జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 2019-20లో 17.8 శాతం నమోదు కాగా.. 2021 సంవత్సరానికి గాను 19.9 శాతం సాధించడంలో మన రైతాంగం చేసిన కృషి అభినందనీయమన్నారు. జాతీయ వరి ఉత్పత్తిలో మూడో వంతు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలు ఉండడం విశ్వవిద్యాలయం సాధించిన పరిశోధన ప్రగతికి లభించిన గౌరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పండించే వేరుసెనగలో 95 శాతం వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు ఉండడం రాష్ర్ట వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో దీని వాటా 1.06 శాతం ఉండడం గర్వకారణం.
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలకు సాంకేతికంగా సహకారం అందిస్తూ గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఙానాన్ని రైతులకు అందించడంతో వ్యవసాయ విశ్వవిద్యాలయ సేవలు మూరుమూల గ్రామ రైతులకు చేరడం విశేష పరిణామం అన్నారు. 2018-19, 2019-20 సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ పంటల్లో రూపొందించిన నూతన రకాలు రాష్ర్ట, జాతీయ స్థాయిలో రైతుల మన్నననలు పొందాయన్నారు.
వీటిలో ముఖ్యంగా పోషక విలువలతో అభివృద్ధి పరిచిన(జింకు, ఇనుము) రాగి రకం ఇంద్రావతిని 2020 ఆక్టోబర్ 16న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో ఆవిష్కరించి జాతి అంకితం చేయడం సంతోషించదగ్గ విశేషమన్నారు. దేశం కోసం ప్రధాని దేశవాప్తంగా రైతులకు పంటల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. జాతీయ స్థాయిలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయం తక్కువగా ఉండడం, తరచూ పంట నష్టాలు సంబవించడం, మార్కెట్ ఒడిదుడుకులు, అప్పుల్లో కూరుకుపోవడం వంటి అంశాలపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రధాన పంట ఉత్పత్తుల సేకరణ వేగవంతం చేయడం, స్మార్ట్ వ్యవసాయం, వ్యవసాయంలో వైవిధ్యం, సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆహార భద్రత, పంట ఉత్పాదకతా పెంపు, రైతు ఆదాయం పెంపుపై దృ సారించాలని సూచించారు.
స్నాతకోత్సవంలో భాగంగా 2018-19, 2019-20 విద్యా సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో బి.ఎస్సీ (వ్యవసాయం) పూర్తి చేసిన 1544 మందికి, పి.జి పూర్తి చేసిన 328 మందికి, 91 మంది పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ప్రతి స్నాతకోత్సవంలో ఉత్తమ అధ్యాపకులు, ఉత్తమ శాస్ర్తవేత్తలు, ఉత్తమ యువశాస్ర్తవేత్తలు, విస్తరణ శాస్ర్తవేత్తల అవార్డులను అతిథులు అందజేశారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52, 53వ సంయుక్త స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. అంతేకాకుండా తొలిసారిగా జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అసోసియేట్ డీన్ హెూదాలో పనిచేస్తూ విద్యార్థులతో కలిసి పరిశోధించి ఆవిష్కరించిన
బిపిటి 5204( సోనా మసూరి ) అనే రకాన్ని విడుదల చేసి అంతర్జాతీయంగా గుర్తింపు సాధించిన ప్రొ. ఎన్.వి.రెడ్డి, స్వర్ణ రకం వరి రూపకర్త వి.రామచంద్రరావు స్మారకార్థం జాతీయ స్థాయి అవార్డులను అందజేశారు. డాక్టర్ వి.రామచందద్రరావు జాతీయ అవార్డును ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎ.కె.సింగ్, డాక్టర్ ఎన్.వి.రెడ్డి జాతీయ అవార్డును విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణకు అందజేశారు.
ముందుగా 52, 53వ సంయుక్త స్నాతకోత్సవ ప్రగతి నివేదికను విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి కులపతి వారికి నివేదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ. సి. ఎ. ఆర్) జే ఆర్. యఫ్, యస్. ఆర్. యఫ్, గేట్ ఫెలౌషిప్స్ 2018 -2019వ సంవత్సరానికి గాను 65 మంది విద్యార్ధులు, 2019 – 20వ సంవత్సరానికి 105 ఐ. సి. ఎ. ఆర్, జే ఆర్. యఫ్, యస్. ఆర్. యఫ్, గేట్ కు ఎంపిక కాబడ్డరని, జాతీయ స్థాయిలో అత్యధిక ర్యాంకులు దేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సాధించిన విశ్వవిద్యాలయంగా ఐసీఏఆర్ అవార్డు సాధించిందని తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ పంటల్లో విడుదల చేసిన నూతన రకాలు, వాటి విశిష్టతను ఆయన తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, ప్రశంసాపత్రాలు వివరాలను వెల్లడించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాదిన్నర కాలంగా పరిశోధించిన అందుబాటులోకి తెచ్చిన డ్రోన్ వ్యవసాయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం కానుందని, గ్రామీణ ప్రాంతాల్లో సైతం డ్రోన్ వ్యవసాయం సాగాలన్న లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా డ్రోన్‌లను అందబాటులోకి తెస్తామన్నారు. అందుకు అవసరమైన పైలట్‌లను వ్యవసాయ పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేశామని, త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో డ్రోన్ పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేసిన రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంకోసం అనేక కార్యక్రమాలుబుచేపట్టిందని అన్నారు. వైఎస్ ఆర్ బీమా, ఫ్రీ క్రాప్ ఇనుఁరెన్స్, సున్నా వడ్డీ పొలం బడి , అగ్రిలాబ్స్ ఏర్పాటు , 10778 ఆర్బికే ల ఏర్పాటుతో రైతులకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలు , ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు . ముఖ్యమంత్రి మానస పుత్రిక ఆర్ బి కె లు ఇతర రాస్గ్త్రలకు ఆదర్శంగా నిలిచి కేంద్రప్రభుత్వ చాంపియన్ అవార్డుకు నామినేషన్ పొందిందని అన్నారు. ఆచార్య ఎన్ జి రంగా యూనివర్సిటీ సహకారంతో రైతులకు డ్రోన్ టెక్నాలజీ తో తక్కువ వ్యయంతో నానో టెక్నాలజీతో మందులు చల్లడం వంటివి అందిబాటులోకి తెచ్చ్చిందని ప్రభుత్వం కస్టమర్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు తో యాంత్రీకరణ అందుబాటులోకి తెచ్చ్చామని తెలిపారు. నేడు వ్యవసాయ విద్యార్థులు చదువు పూర్తిచేసి వెళుతున్నారు , రైతులకు అందుబాటులో ఉండి తమవంతు సహకారం అందించాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎం పి గురుమూర్తి ,స్పెషల్ సి ఎస్ టు గవర్నర్ సిసోడియా , విశ్వవిద్యాలయ రిజిస్ర్టార్ డాక్టర్ టి.గిరిధర్‌కృష్ణ, డీన్ డాక్టర్ ప్రతాప్‌కుమార్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డీన్‌లు డాక్టర్ యల్లారెడ్డి, డాక్టర్ గుత్తా రామారావు, డాక్టర్ చిరంజీవి, సీవోఈ డాక్టర్ పి.సుధాకర్, విద్యార్థి వ్యవహారాల అధికారి డాక్టర్ ఎం.మార్టిన్ లూథర్, పాలక మండలి సభ్యులు, అకడమిక్ కౌన్సెల్ సభ్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.