తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సప్రవ హరి చందన్ దంపతులు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులకు టీటీడీ అభికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటాన్ని గవర్నర్కు టీటీడీ ఈవో అందజేశారు. గవర్నర్ వెంబడి రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తదితరులు ఉన్నారు.
Tags tirumala
Check Also
ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం
-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …